మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధ శ్రీ మహాకాళేశ్వర ఆలయంలో సోమవారం ఉదయం జరిగిన భస్మ హారతి పూజలో భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు పాల్గొన్నారు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన 2వ టీ20 మ్యాచ్ అనంతరం టీమిండియా ఆటగాళ్లు రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, జితేష్ శర్మ, తిలక్ వర్మ ఉజ్జయిని చేరుకున్నారు. అనంతరం మహాకాళేశ్వరాలయానికి వచ్చిన నలుగురు క్రీడాకారులు నంది హాలులో భక్తులతో కలిసి కూర్చుని బాబా మహాకాళుని దివ్య భస్మ హారతి పూజలో పాల్గొని ఆశీస్సులు పొందారు. ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్ల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బాబా మహాకాళ్ ఆరతి పూజలో పాల్గొన్న అనంతరం టీం ఇండియా వికెట్ కీపర్ జితేష్ శర్మ మాట్లాడుతూ.. ‘నేను బాబా మహాకాల్ భక్తుడిని. సమయం దొరికినప్పుడల్లా ఇక్కడికి వస్తాను. ఇక్కడికి రావడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది’ అని చెప్పుకొచ్చాడు. ‘ప్రపంచ ప్రసిద్ధి చెందిన బాబా మహాకాళ దేవాలయం, అలాగే ఇక్కడ జరిగే భస్మ హారతి గురించి నేను విన్నాను. అయితే తొలిసారిగా బాబా మహాకాల్‌ను చూసేందుకు వచ్చాను. భస్మ హారతి పూజలో పాల్గొన్నాను’ అని స్పిన్నర్ రవి బిష్ణోయ్ తెలిపాడు.
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జనవరి 17న చివరి మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ ద్వారా సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో టీమ్ ఇండియా ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. ఈ మ్యాచ్ తర్వాత టీమ్ ఇండియా టీ20 మ్యాచ్ లు ఇప్పట్లో లేవు. అంటే టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత జట్టు ఆడబోయే చివరి టీ20 మ్యాచ్ ఇదే. ఆ తర్వాత భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్ కూడా షురూ కానుంది.
#WATCH | Madhya Pradesh | Indian cricketers Tilak Varma, Washington Sundar, Jitesh Sharma & Ravi Bishnoi attend ‘Bhasma Aarti’ performed at Shree Mahakaleshwar Temple in Ujjain. pic.twitter.com/PGYyiS809h
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) January 14, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..