
Ranbir Kapoor RCB Stake: ఐపీఎల్ (IPL) అంటే కేవలం క్రికెట్ మాత్రమే కాదు, గ్లామర్, బిజినెస్ కలబోత. ఇప్పటికే షారుఖ్ ఖాన్, ప్రీతి జింటా వంటి స్టార్స్ ఐపీఎల్ జట్లలో భాగస్వాములుగా ఉండగా, ఇప్పుడు ఆ జాబితాలోకి బాలీవుడ్ ‘యానిమల్’ రణబీర్ కపూర్ కూడా చేరబోతున్నట్లు సమాచారం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీలో రణబీర్ వాటా తీసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తోంది.
తాజా నివేదికల ప్రకారం, ఈ డీల్ సుమారు రూ. 300 నుంచి రూ. 350 కోట్ల మధ్య ఉండవచ్చని అంచనా. అయితే ఇందులో ఒక ఆసక్తికరమైన అంశం ఉంది. రణబీర్ కపూర్ కేవలం నగదు రూపంలోనే కాకుండా, “స్వేట్ ఈక్విటీ” (Sweat Equity) పద్ధతిలో వాటా పొందుతారని తెలుస్తోంది. అంటే.. రాబోయే పదేళ్ల పాటు రణబీర్ కపూర్ తన ఇమేజ్ రైట్స్ (Image Rights), ప్రచార బాధ్యతలను ఆర్‌సీబీకి అప్పగిస్తారు. దీనికి ప్రతిఫలంగా అతనికి జట్టులో 8% వరకు వాటా లభించే అవకాశం ఉంది.
నగదు, ప్రచారం కలయిక: వార్తల ప్రకారం, రణబీర్ రూ.300-350 కోట్ల నగదు పెట్టుబడితో 2% వాటాను, మిగిలిన 6% వాటాను తన బ్రాండ్ వాల్యూ ద్వారా (ప్రచార కర్తగా వ్యవహరించడం ద్వారా) పొందే అవకాశం ఉంది. దీనివల్ల ఆర్‌సీబీకి గ్లోబల్ స్థాయిలో మరింత క్రేజ్ వస్తుందని మేనేజ్మెంట్ భావిస్తోంది.
విరాట్ – రణబీర్ జోడీ: విరాట్ కోహ్లీ, రణబీర్ కపూర్ మంచి స్నేహితులనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు రణబీర్ మేనేజ్మెంట్ బోర్డులోకి వస్తే, మైదానంలో విరాట్ ఆట.. బయట రణబీర్ ప్రచారం ఆర్‌సీబీకి తిరుగులేని బలాన్ని ఇస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే రణబీర్‌కు ఫుట్‌బాల్ జట్టు (ముంబై సిటీ ఎఫ్‌సీ) నిర్వహణలో అనుభవం ఉండటం ఈ డీల్‌కు అదనపు బలాన్ని చేకూరుస్తోంది.
మరోవైపు, ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ అయిన ‘బ్లాక్‌రాక్’ (BlackRock) కూడా ఆర్‌సీబీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్లు వినికిడి. ఈ నేపథ్యంలో రణబీర్ వంటి పాపులర్ స్టార్ జట్టులో ఉండటం వల్ల బ్రాండ్ విలువ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.
Team India: టీమిండియా ఓటమికి అతిపెద్ద విలన్ ఇతడే.. కట్‌చేస్తే.. వన్డేల నుంచి రిటైర్మెంట్?
అయితే, ఈ విషయంపై రణబీర్ కపూర్ గానీ, ఆర్‌సీబీ యాజమాన్యం గానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఒకవేళ ఇది నిజమైతే, వచ్చే ఐపీఎల్ వేలంలో మనం రణబీర్ కపూర్‌ను ఆర్‌సీబీ టేబుల్ వద్ద చూడవచ్చు!
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..