
Rajat Patidar: Madhya Pradesh vs Haryana: ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో రజత్ పాటిదార్ సెంచరీతో సత్తా చాటాడు. అది కూడా కేవలం 68 బంతుల్లోనే కావడం విశేషం. హర్యానాతో జరిగిన ఈ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ తరపున మూడో నంబర్‌లో ఫీల్డింగ్‌లోకి వచ్చిన పాటిదార్ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.

ఆరంభం నుంచే భీకర బ్యాటింగ్ ప్రదర్శించిన పాటిదార్ హర్యానా బౌలర్లను చిత్తు చేశాడు. ఫలితంగా పాటిదార్ బ్యాట్ నుంచి 3 భారీ సిక్సర్లు, 6 ఫోర్లు బాదాడు. ఈ సిక్స్ ఫోర్లతో రజత్ కేవలం 68 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో రంజీ టోర్నీలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

రంజీ టోర్నీలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రికార్డు రిషబ్ పంత్ పేరిట ఉంది. 2016లో ఢిల్లీ తరపున ఆడిన పంత్ జార్ఖండ్‌పై కేవలం 48 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. రంజీ టోర్నీ చరిత్రలో ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు.

2023లో ఛత్తీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో అస్సాం తరపున సంచలనం సృష్టించిన రియాన్ పరాగ్ కేవలం 56 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. రంజీ టోర్నీలో ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచరీ.

ఇప్పుడు ఈ జాబితాలో రజత్ పటీదార్ కేవలం 68 బంతుల్లోనే సెంచరీ సాధించి మూడో స్థానంలో నిలిచాడు. దీంతో మధ్యప్రదేశ్ తరపున రంజీ టోర్నీలో వేగవంతమైన సెంచరీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.