IPL 2022: ఐపీఎల్‌లో రజత్ పాటిదార్‌ అరుదైన ఘనత.. తొలి భారత ఆటగాడిగా రికార్డు..

|

May 28, 2022 | 8:24 AM

ఐపీఎల్‌(IPL)లో ఆర్సీబీ(RCB) యువ ఆటగాడు రజత్‌ పాటిదార్‌(Rajath patidhar) అరుదైన రికార్డు సాధించాడు. ఒక ఐపీఎల్‌ సీజన్ ప్లే ఆఫ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు...

IPL 2022: ఐపీఎల్‌లో రజత్ పాటిదార్‌ అరుదైన ఘనత.. తొలి భారత ఆటగాడిగా రికార్డు..
Rajath Patidar
Follow us on

ఐపీఎల్‌(IPL)లో ఆర్సీబీ(RCB) యువ ఆటగాడు రజత్‌ పాటిదార్‌(Rajath patidhar) అరుదైన రికార్డు సాధించాడు. ఒక ఐపీఎల్‌ సీజన్ ప్లే ఆఫ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌-2022 ప్లే ఆఫ్స్‌లో 170 పరుగులు చేసిన పాటిదార్‌ ఈ ఘనత సాధించాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో 112 పరుగులు, రాజస్తాన్‌ రాయల్స్‌తో క్వాలిఫైర్ ‌2లో 58 పరుగులు పాటిదార్‌ చేశాడు. ఇక ఓవరాల్‌గా ప్లే ఆఫ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఆస్ట్రేలియా స్టార్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ ఉన్నాడు. 2016 సీజన్‌లో వార్నర్‌ 190 పరుగులు సాధించాడు. ఇక 170 పరుగలతో పాటిదార్‌ రెండో స్థానంలో ఉన్నాడు.

ఒకే ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్‌ కోహ్లీ కొనసాగుతోన్నాడు. ఆ తర్వాత డెవిడ్ వార్నర్‌ ఉన్నాడు. మూడో స్థానంలో జోస్ బట్లర్ ఉన్నాడు, కోహ్లీ 2016 సీజన్‌లో 973 పరుగులు చేశాడు. ఇదే సీజన్‌లో సన్‌రైజర్స్ ఆటగాడు డెవిడ్‌ వార్నర్‌ 848 పరుగులు చేశాడు. ప్రస్తుతం జరుగుతోన్న 2022లో ఐపీఎల్‌లో జోస్‌ బట్లర్‌ 824 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. మరో 25 పరుగులు చేస్తే బట్లర్ రెండో స్థానానికి చేరుకుంటాడు. అయితే కోహ్లీని బీట్‌ చేయడానికి బట్లర్‌కు అవకాశం లేదు. ఎందుకంటే బట్లర్‌ కేవలం ఒక్క మ్యాచ్‌ ఆడే అవకాశం ఉంది. అది ఫైనల్‌ కాబట్టి అతను మరోసారి సెంచరీ చేసినా మొదటి స్థానానికి చేరుకోలేడు.

ఇవి కూడా చదవండి