IPL 2026 Mega Auction : రాజస్థాన్ రాయల్స్‌లో భారీ మార్పులు.. సంజు శాంసన్‌తో సహా ముగ్గురు బిగ్ ప్లేయర్స్ ఔట్

రాజస్థాన్ రాయల్స్‌లో జరగబోయే అతి పెద్ద మార్పులలో ఒకటి, జట్టు కెప్టెన్ సంజు శాంసన్‌ను విడుదల చేయడం. గత సీజన్‌లో జట్టు వైఫల్యం, శాంసన్ వ్యక్తిగత ప్రదర్శనపై ప్రభావం చూపింది. గత సీజన్‌లో గాయాలతో బాధపడిన సంజు కేవలం 9 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అంతేకాకుండా కెప్టెన్సీ ఒత్తిడి అతని బ్యాటింగ్‌పై ప్రభావం చూపింది.

IPL 2026 Mega Auction : రాజస్థాన్ రాయల్స్‌లో భారీ మార్పులు.. సంజు శాంసన్‌తో సహా ముగ్గురు బిగ్ ప్లేయర్స్ ఔట్
Sanju Samson (1)

Updated on: Oct 11, 2025 | 4:11 PM

IPL 2026 Mega Auction : ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలో గత సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేని రాజస్థాన్ రాయల్స్ జట్టు భారీ మార్పులకు సిద్ధమవుతోంది. గత సీజన్‌లో తొమ్మిదో స్థానంలో నిలిచిన ఆర్ఆర్.. కొత్త కెప్టెన్, కొత్త ఆటగాళ్లతో బరిలోకి దిగాలని చూస్తోంది. ఈ మెగా ఆక్షన్ ముందు జట్టులో కీలకమైన ముగ్గురు ఆటగాళ్లను, ముఖ్యంగా ప్రస్తుత కెప్టెన్ సంజు శాంసన్‌ను కూడా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రాజస్థాన్ రాయల్స్‌లో జరగబోయే అతి పెద్ద మార్పులలో ఒకటి, జట్టు కెప్టెన్ సంజు శాంసన్‌ను విడుదల చేయడం. గత సీజన్‌లో జట్టు వైఫల్యం, శాంసన్ వ్యక్తిగత ప్రదర్శనపై ప్రభావం చూపింది. గత సీజన్‌లో గాయాలతో బాధపడిన సంజు కేవలం 9 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అంతేకాకుండా కెప్టెన్సీ ఒత్తిడి అతని బ్యాటింగ్‌పై ప్రభావం చూపింది.

సంజు శాంసన్ తన ఐపీఎల్ కెరీర్‌ను 2013 లో రాజస్థాన్ రాయల్స్‌తోనే ప్రారంభించాడు. అతను ఐపీఎల్‌లో ఇప్పటివరకు చేసిన 4,704 పరుగులు రాజస్థాన్ తరఫున చేసినవే. అయినప్పటికీ, నిరంతర గాయాలు, కమాండింగ్ కెప్టెన్సీ చేయలేకపోవడం వంటి కారణాల వల్ల ఫ్రాంచైజీ అతనిని మెగా ఆక్షన్ ముందు విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

రాజస్థాన్ రాయల్స్ విడుదల చేయాలని యోచిస్తున్న మరో కీలక ఆటగాడు శ్రీలంక స్పిన్నర్ మహీష్ తీక్షణ. గత సీజన్‌లో తీక్షణను ఆర్ఆర్ జట్టు రూ. 4.40 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, అతని ప్రదర్శన అంచనాలను అందుకోలేకపోయింది. అతను ఆడిన సీజన్ మొత్తంలో కేవలం 11 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అంతేకాకుండా, అతని ఎకానమీ రేటు 9.26 గా, బౌలింగ్ సగటు 37 కంటే ఎక్కువగా ఉండటం తీవ్ర నిరాశ కలిగించింది.

జట్టు మేనేజ్‌మెంట్ ఇప్పుడు పవర్ ప్లే, డెత్ ఓవర్లలో ప్రభావం చూపగల మంచి స్పెషలిస్ట్ స్పిన్నర్ కోసం చూస్తోంది. ఈ నేపథ్యంలో తీక్షణను విడుదల చేసి మెరుగైన స్పిన్ ఆప్షన్లను పరిశీలించే అవకాశం ఉంది. వెస్టిండీస్‌కు చెందిన విధ్వంసకర బ్యాట్స్‌మెన్ షిమ్రాన్ హెట్‌మయర్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. హెట్‌మయర్ గత కొన్ని సీజన్లుగా తన స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోతున్నాడు. అతన్ని రూ. 11 కోట్లకు రిటైన్ చేసుకున్నారు. అయితే, 2025 సీజన్‌లో అతను 14 మ్యాచ్‌లలో కేవలం 239 పరుగులు మాత్రమే చేశాడు. జట్టుకు ముఖ్యమైన ఫినిషర్ పాత్రలో అతను పూర్తిగా విఫలమయ్యాడు.

2022 సీజన్ తర్వాత హెట్‌మయెర్ ఏ సీజన్‌లోనూ 300 పరుగుల మార్కును చేరుకోలేకపోయాడు. అందుకే, రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు అతన్ని విడుదల చేసి, ఆక్షన్ ద్వారా కొత్త ఫినిషర్ లేదా విదేశీ పవర్ హిట్టర్‌ను తీసుకోవాలని ప్రణాళిక వేస్తోంది. రాజస్థాన్ రాయల్స్ 2026 సీజన్‌కు పూర్తిగా కొత్త వ్యూహం, కొత్త ముఖాలతో ముందుకు రావాలని నిర్ణయించుకుంది. జట్టును బలోపేతం చేయడానికి అనుభవజ్ఞులైన ఆల్‌రౌండర్‌లు, స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌లపై దృష్టి సారించనుంది. ఈ మెగా ఆక్షన్ ముందు ఈ ముగ్గురు కీలక ఆటగాళ్లను విడుదల చేయడం ద్వారా, ఆర్ఆర్ వచ్చే సీజన్‌ను కొత్త కెప్టెన్, కొత్త ఆలోచనలతో ప్రారంభించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..