ఐపీఎల్‌లో తొలి విజేతగా నిలిచిన జట్టు రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals). కానీ, 2008 మొదటి సీజన్ తరువాత నుంచి ఈ జట్టు విజయం కోసం తహతహలాడుతోంది. ఐపీఎల్ 2022(IPL 2022) లో ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ కొత్త ఉత్సాహంతోపాటు కొత్త ఆటగాళ్లతో ఆడటం కనిపిస్తుంది. ఈ వేలంలో, జట్టు గత తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుని యువకులతోపాటు అనుభవజ్ఞులైన ఆటగాళ్ల కలయికపై దృష్టి సారించింది. జట్టుకు సంజూ శాంసన్(Sanju Samson) రూపంలో యువ కెప్టెన్ ఉండగా, కుమార సంగక్కర, లసిత్ మలింగ వంటి పెద్ద పేర్లు కోచింగ్ సిబ్బందిలో భాగంగా ఉన్నాయి. మొదటి సీజన్ నుంచి ఈ జట్టు మూడుసార్లు ప్లే ఆఫ్స్‌లో భాగం చేయగలిగింది. ఈ జట్టు 14 సీజన్లలో ఒక్కసారి మాత్రమే పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.
రాజస్థాన్ రాయల్స్ ప్రారంభ సీజన్‌లో అనుభవానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. షేన్ వార్న్, రాహుల్ ద్రవిడ్ ఈ జట్టు వారసత్వంలో భాగమయ్యారు. ఈ మధ్య సంవత్సరాల్లో, ఈ ఫ్రాంచైజీ పెద్ద పేర్లపై దృష్టి సారించింది. ఈ కారణంగా, బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, జోస్ బట్లర్, స్టీవ్ స్మిత్ వంటి పేర్లు ఈ జట్టులో ఉన్నాయి. ఇలాంటి సమయంలో టీం వేలంలో కొంతమంది ఆటగాళ్లకు ఎక్కువ డబ్బు ఖర్చు చేసింది. అయితే ఇప్పుడు ఆ టీమ్ మళ్లీ తొలినాళ్ల వ్యూహం వైపు వెళుతున్నట్లు తెలుస్తోంది.
రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ పవర్..
సంజూ శాంసన్ నేతృత్వంలోని జట్టు బ్యాటింగ్‌లో అద్భుతమైన బ్యాట్స్‌మెన్‌ని కలిగి ఉంది. శాంసన్‌తో పాటు, జోస్ బట్లర్, రెసీ వాన్ డెర్ డ్యూసెన్, డారిస్ మిచెల్, షిమ్రాన్ హెట్‌మెయర్‌లు బ్యాటింగ్‌లో భాగమయ్యారు. అదే సమయంలో దేవదత్ పడిక్కల్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, శుభమ్ గర్వాల్ వంటి యువ బ్యాట్స్‌మెన్‌లను కూడా కలిగి ఉంది. వీరు వేగంగా బ్యాటింగ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు.
పేస్ బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్, నాథన్ కౌల్టర్-నైల్, నవదీప్ సైనీ, ప్రసిద్ధ కృష్ణ వంటి అద్భుతమైన పేర్లు ఉన్నాయి. మరోవైపు, ఒబెడ్ మెక్‌కాయ్, జిమ్మీ నీషమ్ వంటి ఆల్ రౌండర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. జట్టు స్పిన్ విభాగంలో ఆర్ అశ్విన్, యుజువేంద్ర చాహల్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు. ప్లేయింగ్ ఎలెవన్‌లో వీరిద్దరూ కలిసి ఉండటం గ్యారెంటీ. పరుగులను కూడా అరికట్టడంలో వీరు ముందుంటారు. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మద్దతుగా కేసీ కరియప్ప, తేజస్ బరోకా వంటి స్పిన్నర్లు కూడా ఉన్నారు.
రాజస్థాన్ రాయల్స్ బలహీనత..
ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్‌కు అత్యంత ఆందోళన కలిగించే విషయం డెత్ ఓవర్ల బౌలింగ్. చివరి ఓవర్లలో బౌలింగ్ చేయడానికి నమ్మకమైన బౌలర్ లేడు. డెత్ ఓవర్లలో బోల్ట్, సైనీ, కృష్ణల రికార్డు ఫర్వాలేదు. ఇటువంటి పరిస్థితిలో, జట్టు ఇక్కడ ఇబ్బందుల్లో పడవచ్చు. అలాగే, మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్, ఫినిషర్ లేకపోవడం కూడా జట్టు అవకాశాలను దెబ్బతీస్తుంది. మిడిల్ ఓవర్లలో డస్సెన్ ఆడుతున్నట్లు చూడొచ్చు. అయితే వారు తమను తాము నిరూపించుకోవాలి. పరాగ్, హెట్మేయర్, నీషమ్ వంటి ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి.
రాజస్థాన్ రాయల్స్ ప్రత్యేకతలు..
ఈసారి టాప్ ఆర్డర్‌లో రాయల్స్‌కు అద్భుతమైన ఆటగాళ్లున్నారు. శాంసన్, జైస్వాల్, పడిక్కల్, బట్లర్ ఎలాంటి బౌలింగ్‌నైనా చిత్తు చేయగలరు. వీరితో పాటు రాజస్థాన్‌కు చెందిన శుభమ్ గర్వాల్ భారీ షాట్లు కొట్టేందుకు సిద్ధంగా ఉంటాడు. ఇటువంటి పరిస్థితిలో, అతను జట్టు ట్రంప్ కార్డ్ అని నిరూపించగలడు. దక్షిణాఫ్రికాకు చెందిన డస్సెన్ కూడా తన తొలి ఐపీఎల్ సీజన్‌ను చిరస్మరణీయంగా మార్చుకోవాలనుకుంటున్నాడు. ఏది ఏమైనప్పటికీ, వారు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు.
రాజస్థాన్ రాయల్స్ IPL 2022 జట్టు..
సంజు శాంసన్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, జోస్ బట్లర్, రెసి వాన్ డెర్ డ్యూసెన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, శుభమ్ గర్వాల్, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్, కుల్దీప్ సేన్, తేజస్ బరోకా, కెసి కునయ్ సింగ్, అనునయ్ సింగ్ నాథన్ కౌల్టర్-నైల్, జిమ్మీ నీషమ్, డారిల్ మిచెల్, కరుణ్ నయ్యర్, ఒబెడ్ మెక్‌కాయ్, నవదీప్ సైనీ, యుజ్వేంద్ర చాహల్, ప్రసీద్ధ్ కృష్ణ, షిమ్రాన్ హెట్మెయర్.
రాజస్థాన్ రాయల్స్ కోచింగ్ స్టాఫ్..
కుమార సంగక్కర (హెడ్ కోచ్), లసిత్ మలింగ (ఫాస్ట్ బౌలింగ్ కోచ్), దిశాంత్ యాగ్నిక్ (ఫీల్డింగ్ కోచ్).
Also Read: Watch Video: ఇదేందిరా సామీ.. బౌలర్‌ను ఇలా కూడా కన్ఫ్యూజ్ చేస్తారా? నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..
IPL 2022: ఐపీఎల్‌లో సూపర్ సీనియర్లు వీరే.. తగ్గేదేలే అంటూ యువకులతో పోటాపోటీ.. వారెవరంటే?