IPL 2022: రాజస్థాన్‌ రాయల్స్ పాలిట సమస్యగా స్టార్ బౌలర్.. సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు..

|

May 27, 2022 | 1:05 PM

రాజస్థాన్ రాయల్స్ ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ 2022లో బంతితో పాటు బ్యాట్‌తో అద్భుతాలు చేస్తున్నాడు. కాగా, రెండో క్వాలిఫయర్‌కు ముందు, రాజస్థాన్ రాయల్స్ జట్టుకు అశ్విన్ ఇబ్బందిగా మారడతాడని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు.

IPL 2022: రాజస్థాన్‌ రాయల్స్ పాలిట సమస్యగా స్టార్ బౌలర్.. సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు..
Sanjay Manjrekar
Follow us on

ఐపీఎల్ 2022(IPL 2022) రెండో క్వాలిఫయర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)తో తలపడేందుకు రాజస్థాన్ రాయల్స్(RR) సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తొలి క్వాలిఫయర్‌లో రాజస్థాన్ రాయల్స్ పరాజయం పాలైంది. మరోవైపు బెంగళూరు 14 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్‌ను ఓడించి రెండో క్వాలిఫయర్‌లో చోటు దక్కించుకుంది. ఇప్పటి వరకు జట్టు కోసం రాజస్థాన్ స్పిన్ జోడీ యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్ అద్భుతాలు చేశారు.

చాహల్-అశ్విన్ తొలి క్వాలిఫయర్‌లో విఫలం..

ఈ సిరీస్‌లో మొదటి క్వాలిఫయర్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగింది. గుజరాత్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ మొదట ఆడుతున్నప్పుడు 188 పరుగులు చేసింది. జట్టు స్ట్రాంగ్ బౌలింగ్ చూస్తుంటే ఈ లక్ష్యం చాలా పెద్దదిగా అనిపించినా.. మరో 3 బంతులు మిగిలి ఉండగానే గుజరాత్ విజయం సాధించింది. లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన చాహల్ 4 ఓవర్లలో 32 పరుగులు, అనుభవజ్ఞుడైన రవిచంద్రన్ అశ్విన్ 4 ఓవర్లలో 40 పరుగులు ఇవ్వడంతో, రాజస్తాన్ ఆశలు ఆవిరయ్యాయి.

ఇవి కూడా చదవండి

రాజస్థాన్‌కు సమస్యగా అశ్విన్..

రవిచంద్రన్ అశ్విన్ రాజస్థాన్ రాయల్స్‌కు ఇబ్బందిగా మారనున్నాడని భారత జట్టు మాజీ బ్యాట్స్‌మెన్, క్రికెట్ నిపుణుడు సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. ESPNcricinfoతో మాట్లాడుతూ, “రవిచంద్రన్ అశ్విన్ ఫ్లాట్ పిచ్‌లపై చాలా వైవిధ్యాలను ప్రయత్నించడం వల్ల రాజస్థాన్‌కు సమస్యగా తయారయ్యాడు. ఇలాంటి సందర్భాలలో అరుదుగా ఆఫ్ స్పిన్నర్లు బౌలింగ్ చేస్తుంటారు. కానీ, టర్న్ ఉన్నప్పుడు, అతను ప్రమాదకరమైన బౌలర్ అవుతాడు.

బాల్‌తో పాటు బ్యాట్‌తోనూ..

రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ 2022లో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌తోనూ అద్భుతమైన ఆటను ప్రదర్శించాడు. 15 మ్యాచుల్లో 11 వికెట్లు తీశాడు. ఈ సమయంలో, అతను కేవలం 7.33 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. బ్యాటింగ్‌లోనూ 147 స్ట్రైక్‌రేట్‌తో 185 పరుగులు చేశాడు. ఇందులో ఒక ఫిఫ్టీ కూడా ఉంది. ఇది కాకుండా, అతను చివరలో బ్యాటింగ్‌కు రావడం ద్వారా కూడా వేగంగా ఇన్నింగ్స్ ఆడేందుకు అవకాశం లభించింది.