Chris Gayle: ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతోన్న క్రిస్ గేల్ మిగిలిన మ్యాచ్‌ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. చాలా కాలంగా బయో బబుల్‌లో ఉంటుండంతో మానసికంగా బాగా అలసిపోయానన్న గేల్.. విరామం తీసుకునేందుకు ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని పంజాబ్ కింగ్స్ అధికారికంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ‘పంజాబ్ కింగ్స్ గేల్‌ను గౌరవిస్తోంది అలాగే అతను తీసుకున్న నిర్ణయానికి మద్ధతు ఇస్తోంది. రానున్న టీ20 వరల్డ్ కప్‌లో గేల్ మంచి ప్రతిభను కనబరచాలని కోరుకుంటున్నాము’ అంటూ ట్వీట్ చేశారు.
#PBKS respects and supports the decision of @henrygayle.
Wishing him all the success for the upcoming #T20WorldCup!#SaddaPunjab #IPL2021 #PunjabKings https://t.co/QmTqhd8w6k
— Punjab Kings (@PunjabKingsIPL) September 30, 2021
ఇదిలా ఉంటే కరోనా నేపథ్యంలో చాలా కాలంపాటు బయో బబుల్‌లో ఉంటుండడంతో అలసిపోయిన గేల్.. టి20 ప్రపంచకప్‌లో కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగేందుకు విరామం కోరుకుంటున్నానని తెలిపాడు. ఈ విషయమై ఆయన ఆ మాట్లాడుతూ.. ‘కొన్ని నెలలుగా కరేబియన్ ప్రీమియర్ లీగ్ బబుల్.. ఆ తర్వాత ఐపీఎల్ బబుల్‌లో ఉంటున్నాను. మానసిక పునరుత్తేజాన్నిపొందడానికి ఐపీఎల్ నుంచి తప్పుకోవాలనే నిర్ణయం తీసుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సీజన్‌లో పంజాబ్ తరపుణ 10 ఇన్నింగ్స్ ఆడిన గేల్ 193 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో గేల్ అత్యధిక స్కోర్ కేవలం 46 మాత్రమే కావడం గమనార్హం.
ప్లేయర్స్‌కు కరోనా వైరస్ సోకకుండా ఉండాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన విధానమే ఈ బయోబబుల్. దీని ముఖ్య ఉద్దేశం బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచుకుని సురక్షితంగా ఉండటం. ఈ బబుల్‌లోనికి ప్రవేశించాలంటే ముందుగా అందరూ ఏడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండటం తప్పనిసరి. క్వారంటైన్ ముగిసిన తర్వాత ప్రతీ ఒక్కరు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. అందులో కరోనా నెగెటివ్ అని తేలితేనే వారిని బయోబబుల్‌లోనికి అడుగుపెట్టడానికి అనుమతిస్తారు.
Also Read: Petrol Diesel Price: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు.. పెరిగాయా..? తగ్గాయా.? పూర్తి వివరాలు
PM Narendra Modi: భారత సుస్థిరాభివృద్ధికి మరో రెండు కీలక పథకాలు.. నేడు ప్రధాని మోడీ శ్రీకారం..