SRH VS PBKS: చివ‌రి వ‌ర‌కు పోరాడినా ద‌క్క‌ని విజ‌యం.. త‌డ‌బ‌డిన స‌న్‌రైజ‌ర్స్ బ్యాట్స్‌మెన్‌. పంజాబ్ విక్ట‌రీ..

|

Sep 26, 2021 | 1:12 AM

SRH VS PBKS: స‌న్‌రైజ‌ర్స్ హైదార‌బాద్ మ‌రో ప‌రాజ‌యాన్నిమూట‌గ‌ట్టుకుంది. 37వ మ్యాచులో భాగంగా పంబాజ్ కింగ్స్, స‌న్ రైజ‌ర్స్ ల మ‌ధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ అనూహ్య విజ‌యాన్ని సొంతం చేసుకుంది...

SRH VS PBKS: చివ‌రి వ‌ర‌కు పోరాడినా ద‌క్క‌ని విజ‌యం.. త‌డ‌బ‌డిన స‌న్‌రైజ‌ర్స్ బ్యాట్స్‌మెన్‌. పంజాబ్ విక్ట‌రీ..
Follow us on

SRH VS PBKS: స‌న్‌రైజ‌ర్స్ హైదార‌బాద్ మ‌రో ప‌రాజ‌యాన్నిమూట‌గ‌ట్టుకుంది. 37వ మ్యాచులో భాగంగా పంబాజ్ కింగ్స్, స‌న్ రైజ‌ర్స్ ల మ‌ధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ అనూహ్య విజ‌యాన్ని సొంతం చేసుకుంది. చివ‌రి క్ష‌ణం వ‌ర‌కు నువ్వా, నేనా అన్న‌ట్లు సాగిన మ్యాచ్ లో పంజాబ్ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. 126 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని చేధించ‌లేక స‌న్‌రైజ‌ర్స్‌ చ‌తికిల ప‌డింది. జేస‌న్ హోల్డ‌ర్ 29 బంతుల్లో 47 ప‌రుగులు చేసినా జ‌ట్టును గెలిపించ‌క‌లేక‌పోయాడు. చివ‌రి క్ష‌ణం వ‌ర‌కు ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన మ్యాచ్‌లో 5 ప‌రుగుల తేడాతో హైద‌రాబాద్ ఓడిపోయింది.

స్వ‌ల్ప ల‌క్ష్య చేధ‌న‌తో దిగిన స‌న్‌రైజ‌ర్స్‌కు వార్న‌ర్ రూపంలో ఆరంభంలోనే తొలి దెబ్బ త‌గిలింది. ఆ త‌ర్వాత విలియ‌మ్స‌న్ కూడా వెంట‌నే వెనుతిరిగాడు. దీంతో స్కోరు బోర్డు నెమ్మ‌దించింది. ఇక రవి బిష్ణోయ్‌ వేసిన ఎనిమిదో ఓవర్‌లో మనీశ్ పాండే(13) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. తర్వాత వచ్చిన కేదార్‌ జాదవ్‌(12), అబ్దుల్ సమద్‌(1)లను కూడా బిష్ణోయ్‌ వెనక్కి పంపాడు. దీంతో హైదరాబాద్‌కు మరింత కష్టాల్లో పడింది. రాణిస్తున్నాడ‌నున్న సాహా 31 ప‌రుగుల వ‌ద్ద ర‌నౌట్ కావ‌డ‌మే హైద‌రాబాద్ ప‌రాజ‌యం ఖరారైంది.

అయితే ఆ స‌మ‌యంలో హోల్డ‌ర్ భారీ షాట్‌ల‌తో చెల‌రేగ‌డంతో మ‌ళ్లీ మ్యాచ్‌పై ఆశ‌లు చిగురించాయి. చివ‌రి క్ష‌ణంలో 4 బంతుల్లో 10 పరుగులు చేయాల్సి వ‌చ్చింది. మ్యాచ్ చేతులోకి వ‌స్తుంద‌నుకున్న స‌మ‌యంలోనే తర్వాత రెండు బంతులు పరుగులేమి రాలేదు. చివరి బంతికి 7 పరుగులు అవసరం కాగా హోల్డర్‌ ఒక పరుగు మాత్రమే చేశాడు. ఇలా గెలుపు వ‌ర‌కు వెళ్లిన హైద‌రాబాద్ ప‌రాజ‌యాన్ని ఎదుర్కోవాల్సి వ‌చ్చింది.

Also Read: విధ్వంసం..10 బంతుల్లో 54 పరుగులు.. 3 ఫోర్లు 7 సిక్సర్లు.. ఎవరు ఈ బ్యాట్స్‌మెన్‌..?

CSK: వరుస విజయాలతో జోరు మీదున్న చెన్నై సూపర్ కింగ్స్.. క్రెడిట్ ఎంఎస్ ధోనీకే సొంతమా..?

బోర్డుతో గొడవపడ్డాడు.. సెలెక్టర్లను జోకర్‌లన్నాడు.. టీమిండియాకు వరల్డ్‌కప్ అందించాడు.. అతడెవరో తెలుసా.?