పాకిస్థాన్ సూపర్ లీగ్ 2023లో గురువారం కరాచీలోని నేషనల్ స్టేడియంలో ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో పెషావర్ జల్మీ ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. యునైటెడ్ జల్మీ 157 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంతో బాబర్ అజామ్ అర్ధ సెంచరీ వృధా అయింది. 15 ఓవర్లలోపే ఇస్లామాబాద్ యునైటెడ్ టీం మ్యాచ్‌ను ముగించింది.
కాగా, ఈ మ్యాచ్‌లో బాబర్, పాకిస్తాన్ పేసర్ హసన్ అలీ మధ్య ఓ ఫన్నీ సీన్ చోటుచేసుకుంది. పాకిస్తాన్ సారథి బాబర్ పరుగు తీసే క్రమంలో తన బ్యా్ట్‌తో బౌలర్‌ను కొట్టేందుకు ట్రై చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
Some banter between Babar Azam and Hassan Ali#PZvsIUpic.twitter.com/tDsxIhcrCl
— Cricket Pakistan (@cricketpakcompk) February 23, 2023
పెషావర్ జల్మీ జట్టు బ్యాటింగ్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 14 ఓవర్ సంధిస్తోన్న హసన్ అలీ.. చివరి బంతికి బాబర్ అజాం రన్ తీసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇస్లామాబాద్ యునైటెడ్ బౌలర్ హసన్ అలీ అడ్డుగా ఉండి, ఏదో అన్నాడు. దీంతో నాన్ స్ట్రైకర్ వైపు వస్తూ సరదాగా తన బ్యాట్‌తో కొట్టేందుకు ట్రై చేశాడు. దీంతో హసన్ నవ్వుతూ పక్కకు తప్పుకున్నాడు. ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ జల్మీ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజం హాఫ్ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కేవలం 58 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 75 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 157 టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టు.. కేవలం 14.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. గుర్బాజ్ 62 పరుగులతో దంచి కొట్టగా, వాన్ డెర్ డస్సెన్ 42 పరుగులతో జట్టు విజయానికి బాటలు వేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..