Prithvi shaw: ఆ పరీక్షలో ఫెయిలైన పృథ్వీ షా.. ట్రోల్ చేస్తున్న నేటిజన్లు..

|

Mar 17, 2022 | 5:51 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 (IPL 2022)లో పాల్గొనడానికి ముందు పృథ్వీ షా(Prithvi Shaw) ఫిట్‌నెస్‌పై అనుమానాలు తలెత్తాయి...

Prithvi shaw: ఆ పరీక్షలో ఫెయిలైన పృథ్వీ షా.. ట్రోల్ చేస్తున్న నేటిజన్లు..
Prithvi Shaw
Follow us on

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 (IPL 2022)లో పాల్గొనడానికి ముందు పృథ్వీ షా(Prithvi Shaw) ఫిట్‌నెస్‌పై అనుమానాలు తలెత్తాయి. ఎన్‌సీఏ(NCA)లో జరిగిన యో-యో టెస్టులో పృథ్వీ షా విఫలమయ్యాడు. యో-యో టెస్టులో ఉత్తీర్ణత సాధించేందుకు పృథ్వీ షా 16.5 పాయింట్లు సాధించాల్సి ఉండగా.. అతను 15 పాయింట్లను కూడా సాధించలేకపోయాడు. అతనితో కలిసి యో-యో టెస్టు ఇచ్చిన హార్దిక్ పాండ్యా ఈ స్కోరును చాలా సులువుగా దాటేశాడు. పాండ్యా 17 పాయింట్లు సాధించడంతో పాటు నెట్స్‌లో కూడా నిలకడగా బౌలింగ్ చేశాడు. అతని బంతుల వేగం 135 కి.మీ.గా ఉంది. పృథ్వీ షా YO-YO టెస్ట్‌లో విఫలమవడంతో సోషల్ మీడియాలో అతన్ని ట్రోల్ చేస్తున్నారు.

పృథ్వీ షా వరుసగా మూడు రంజీ మ్యాచ్‌లు ఆడాడని, అతని అలసట కారణంగా యో-యో టెస్ట్ పాస్ కాలేదని చెబుతున్నారు. ఈ మూడు మ్యాచ్‌ల సమయంలో షా బయో బబుల్‌లో ఉండిపోయాడు. దీని కారణంగా యో-యో టెస్ట్ సమయంలో అతను ఇబ్బంది పడ్డాడు. అయితే ఈ ఆటగాడు యో-యో టెస్ట్‌లో విఫలమైనా, మ్యాచ్‌లను గెలిపించగలిగే సత్తా అతనికి ఉందని అందరికీ తెలుసు. అందుకే ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ 7.50 కోట్ల భారీ ధర చెల్లించి పృథ్యీ షాని సొంత చేసుకుంది.

ఈ ముంబై బ్యాట్స్‌మెన్ 5 టెస్టులు ఆడాడు. 42 కంటే ఎక్కువ సగటుతో 339 పరుగులు చేశాడు. వన్డేల్లో ఈ ఆటగాడు 31.5 సగటుతో 189 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో షా 24.62 సగటుతో 1305 పరుగులు చేశాడు. షా స్ట్రైక్ రేట్ 150కి చేరువలో ఉంది.

Read Also..  IPL 2022: విరాట్ కోహ్లీని ఎంఎస్ ధోనీ దాటేస్తాడా.. అభిమానులు ఏమనుకుంటున్నారు..