Prithvi shaw: కెప్టెన్‌గా ఎంపికైన పృథ్వీ షా.. గాయం కారణంగా జట్టుకు దూరమైన దూబే, రహానే, సూర్యాకుమార్‌..

|

May 24, 2022 | 3:38 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022(IPL 2022)లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శన నిరాశపరిచింది. ఆ జట్టుకు ప్లేఆఫ్‌కు చేరుకునే అవకాశం ఉంది కానీ ముంబై ఇండియన్స్‌(MI)తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి తర్వాత ఈ జట్టు టోర్నీ నుంచి నిష్కక్రమించింది...

Prithvi shaw: కెప్టెన్‌గా ఎంపికైన పృథ్వీ షా.. గాయం కారణంగా జట్టుకు దూరమైన దూబే, రహానే, సూర్యాకుమార్‌..
Prithvi Shaw
Follow us on

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022(IPL 2022)లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శన నిరాశపరిచింది. ఆ జట్టుకు ప్లేఆఫ్‌కు చేరుకునే అవకాశం ఉంది కానీ ముంబై ఇండియన్స్‌(MI)తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి తర్వాత ఈ జట్టు టోర్నీ నుంచి నిష్కక్రమించింది. ఢిల్లీ క్యాపిటల్స్ టోర్నమెంట్‌లో గెలవగలిగే అనేక మ్యాచ్‌లలో ఓడిపోయింది. పృథ్వీ షా పేలవ ప్రదర్శన కూడా ఢిల్లీ ఓటమికి ప్రధాన కారణం. IPL 2022లో పృథ్వీ షా(Prithvi shaw) తన ప్రతిభకు న్యాయం చేయలేకపోయాడు. చివరి లీగ్ మ్యాచ్‌ల సమయంలో అతని ఆరోగ్యం కూడా క్షీణించింది, అతను కూడా ఆసుపత్రిలో చేరవలసి వచ్చింది. అయితే ఇప్పుడు పృథ్వీ షాకి ఓ పెద్ద బాధ్యతను అప్పగించారు. ఈ పేలుడు కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌ను ముంబై రంజీ జట్టుకు కెప్టెన్‌గా నియమించారు. జూన్ 6 నుంచి బెంగళూరులో రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. ముంబై తన మ్యాచ్‌ ఉత్తరాఖండ్‌తో ఆడాల్సి ఉంది. సోమవారం రాత్రి ముంబై రంజీ జట్టు సెలక్టర్లు జట్టును ప్రకటించారు.

శ్రేయాస్ అయ్యర్ దక్షిణాఫ్రికాతో T20 సిరీస్ ఎంపిక చేయడంతో అతన్ని రంజి జట్టుకు ఎంపిక చేయలేదు. గాయం కారణంగా శివమ్ దూబే, అజింక్యా రహానే, సూర్యకుమార్ యాదవ్‌లను ఎంపిక చేయలేదు. సెలక్టర్లు సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్‌లకు జట్టులో అవకాశం కల్పించారు. బౌలర్లలో ధవల్ కులకర్ణి, తుషార్ దేశ్‌పాండే, షామ్స్ ములానీ వంటి అనుభవజ్ఞులైన పేర్లు ఉన్నాయి. ఉత్తరాఖండ్‌పై ముంబై రంజీ జట్టుదే పైచేయిగా ఉంది. గ్రూప్ దశలో ముంబై 3 మ్యాచ్‌లు ఆడగా 2 గెలిచింది, ఒక మ్యాచ్ డ్రా అయింది. సర్ఫరాజ్ ఖాన్ 137కు పైగా సగటుతో 551 పరుగులు చేశాడు. అయితే, షా ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. ఈ ఆటగాడు కేవలం 26.75 సగటుతో 107 పరుగులు మాత్రమే చేశాడు.

ముంబై రంజీ జట్టు – పృథ్వీ షా, యశస్వి జైస్వాల్, భూపేన్ లల్వానీ, అర్మాన్ జాఫర్, సర్ఫరాజ్ ఖాన్, సువేద్ పార్కర్, డ్రూ గోమెల్, ఆదిత్య తారే, హార్దిక్ తమోర్, అమన్ ఖాన్, సాయిరాజ్ పాటిల్, షమ్స్ ములానీ, ద్రుమిల్ మట్కర్, తనుష్ కొటియన్, శశాంక్ అత్తార్డే కులకర్ణి, తుషార్ దేశ్‌పాండే, మోహిత్ అవస్థి, రాయిస్టన్ దియాస్, సిద్ధార్థ్ రౌత్ మరియు ముషీర్ ఖాన్.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తలకు ఇక్కడ క్లిక్‌ చేయండి..