
పై ఫొటోలోని టీమిండియా క్రికెటర్‌ను గుర్తు పట్టారా? ముంబైకు చెందిన ఈ యంగ్ క్రికెటర్ భారత జట్టులోకి కూడా వచ్చాడు. కొన్ని మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఐపీఎల్‌లోనూ సత్తా చాటాడు. అతని దూకుడైన ఆటతీరును చూసి ఇక టీమిండియాలో ప్లేస్ పర్మనెంట్ అనుకున్నారు. అయితే ఉన్నట్లుండి ఫామ్ కోల్పోయాడు. ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టలేకపోయాడు. బాగా బొద్దుగా మారిపోయాడు. దీనికి తోడు నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉన్నాడు. దీంతో భారత జట్టులో స్థానం కోల్పోయాడు. గత ఐపీఎల్‌లోనూ పూర్తిగా నిరాశపర్చాడు. ఇప్పుడు రాబోయే ధనా ధన్ లీగ్ కోసం మళ్లీ ప్రాక్టీస్ మొదలెట్టాడు. . బాగా బరువు పెరిగి బొద్దుగా మారిపోయిన ఈ టీమిండియా క్రికెటర్‌ను చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అతని ఫిటెనెస్ లెవెల్స్‌పై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. మరి ఇంతకీ ఈ టీమిండియా యువ ఆటగాడిని గుర్తు పట్టారా? కష్టంగా ఉందా? అయితే మీకో క్లూ ఈ టీమిండియా యంగ్ క్రికెటర్ ఆటతీరు అచ్చం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌లా ఉంటుంది. క్రీజులో స్టాండ్స్, షాట్ సెలెక్షన్ తీరు కూడా టెండూల్కర్ లాగే ఉంటుంది. క్రికెట్‌లో అతనిని సచిన్ వారసుడిగానే చాలామంది భావించారు. యస్.. ఈ టీమిండియా క్రికెటర్ మరెవరో కాదు పృథ్వీ షా.
గత కొన్నేళ్లుగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న పృథ్వీ షా ఇటీవలే మళ్లీ బ్యాట్ పడ్డాడు. ఐపీఎల్ 2024 సీజన్ కోసం ప్రాక్టీస్ ప్రారంభించాడు. అయితే 24 ఏళ్ల ఈ టీమిండియా క్రికెటర్ బాగా బరువు పెరిగిపోయాడు. చాలా బొద్దుగా కనిపించాడు. దీంతో పృథ్వీ షాను చూసి క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో కొందరు నెటిజన్లు ఈ క్రికెటర్‌ను ట్రోల్ చేస్తున్నారు. 24 ఏళ్లకే ఇలా మారిపోతే టీమిండియాలో స్థానం ఎలా దక్కించుకుంటాడు? అని నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు.
Prithvi Shaw is a case study of how to ruin ur Career & Life – How can a sportsman who has played at the highest level, ruin his body n fitness like this 😨pic.twitter.com/g6UigMHqft
— Mihir Jha (@MihirkJha) December 7, 2023
మిస్టర్ కూల్ ధోనితో సహా పృథ్వీ షా
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..