Prithvi Shaw, Valentine Day: వాలెంటైన్స్ డే సందర్భంగా అంటే ఈరోజు ఫిబ్రవరి 14న భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ పృథ్వీ షా ఓ కీలక ప్రకటన చేశాడు. తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఒక కథనాన్ని పంచుకుంటూ, అతను తన భార్యగా నటి, మోడల్ అయిన నిధి తపాడియా అని ప్రకటించాడు. షా ఇలా షాక్ ఇవ్వడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికే షా తన మాటలు నిజం కాదంటూ చెప్పి, మరోషాక్ ఇచ్చాడు. అయితే, ఇదంతా ఇన్‌స్టాలో జరిగింది. ఈ అకస్మాత్తు పరిణామాలతో షా ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాడు.
పృథ్వీ షా, నిధి తపాడియాల సంబంధం గురించి ఇంతకు ముందు చాలా వార్తలు వచ్చాయి. అయితే ఇవి అధికారికంగా ధృవీకరణకాలేదు. అయితే ఇప్పుడు ఈ రిలేషన్ షిప్‌పై పృథ్వీ షా ఓ ముద్ర వేశాడు. అతను తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి నిధి తపాడియాతోపాటు తను ఉన్న ఫొటోను పంచుకున్నాడు. ఈ ఫొటోపై హార్ట్ ఎమోజీతో పాటు “హ్యాపీ వాలెంటైన్స్ మై వైఫ్” అని రాసుకొచ్చాడు. నిధి తపాడియాను ట్యాగ్ చేశాడు. ఈ ఫొటోలో ఇద్దరూ ప్రత్యేక పోజులు అంటే ముద్దులు ఇచ్చుకుంటూ కనిపించారు.
ఇంతకు ముందు కూడా చాలా సందర్భాలలో ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు కూడా నెట్టింట్లో కనిపించాయి. ఇంతకు ముందు కూడా వీరిద్దరూ కలిసి ఉన్న చాలా ఫోటోలు వైరల్ అయ్యాయి. వీరి అనుబంధం గురించి చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సారి అన్ని వార్తలపై పృథ్వీ స్వయంగా క్లారిటీ ఇచ్చేశాడు. అయితే, ఆ తర్వాత కొద్దిసేపటికే ఎవరో నా ఫొటోను ఎడిట్ చేసి, ఇలాంటి ఫొటోలను పోస్ట్ చేశారంటూ, అందతా అబద్దం అంటూ ప్రకటించాడు.
నిధి తపాడియా వృత్తి రీత్యా నటి, మోడల్‌గా పనిచేస్తుంది. ఆమె మహారాష్ట్రలోని నాసిక్ నివాసి. నిధి ప్రముఖ టీవీ షో సీఐడీలో కనిపించింది. 2016లో తన కెరీర్‌ను ప్రారంభించింది.
చాలా కాలంగా పృథ్వీ షాకు టీమిండియాలో అవకాశం రాకపోవడం గమనార్హం. ఇటీవల, న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు షాను భారత జట్టులో చేర్చారు. అయితే అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..