మరో నెల రోజుల్లో ఐపీఎల్ 2023 ప్రారంభం కానుంది. అయితే ఈలోపే పంజాబ్ కింగ్స్‌కు చెందిన వికెట్ కీపర్- బ్యాట్స్‌మెన్ మైదానంలో తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. బౌలర్లపై వీరవిహారం చేసి.. మెరుపు సెంచరీతో అల్లాడించాడు. DY పాటిల్ T20 కప్ 2023లో ప్రభసిమ్రాన్ సింగ్ శతక్కొట్టాడు. ఈ టోర్నీలో CAG తరపున ఆడుతోన్న ప్రభుసిమ్రాన్ నమ్మశక్యం కాని బ్యాటింగ్‌తో కేవలం 55 బంతుల్లోనే 161 పరుగులు చేశాడు.
ఈ సమయంలో అతడి స్ట్రైక్‌రేట్ 292.73 కాగా.. ఇన్నింగ్స్‌లో ఏకంగా 17 సిక్సర్లు ఉన్నాయి. అలాగే ప్రభసిమ్రాన్ బ్యాట్ నుంచి 9 ఫోర్లు కూడా రావడం విశేషం. ఇక అతడి తుఫాను ఇన్నింగ్స్‌తో CAG జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 267 పరుగులు చేసింది. మరోవైపు ఈ మ్యాచ్‌లోనే కాదు టోర్నమెంట్ అంతటా ప్రభసిమ్రాన్ సింగ్ చెలరేగిపోయాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 330 పరుగులు చేశాడు. 110 సగటుతో అతడి స్ట్రైక్ రేట్ 250 కంటే ఎక్కువ ఉంది. అలాగే మూడు మ్యాచ్‌ల్లో కలిపి ఏకంగా 29 సిక్సర్లు బాదేశాడు. ఈ సెంచరీతో పాటు గత రెండు మ్యాచ్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు సైతం నమోదు చేశాడు.
కాగా, ఐపీఎల్‌లో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. ఆ ఫ్రాంచైజీ ఈ ఆటగాడిని 60 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. కానీ గత నాలుగు సీజన్లలోనూ ఇతడికి సరైన అవకాశాలు రావట్లేదు. అయితే ప్రస్తుతం అతడి ఫామ్ బట్టి.. ఐపీఎల్ 2023లో ఛాన్స్‌లు ఇవ్వొచ్చు.
ప్రభసిమ్రాన్ సింగ్ ఇప్పటివరకు 11 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 49కి పైగా సగటుతో 689 పరుగులు చేశాడు. ఇది కాకుండా, లిస్ట్ A క్రికెట్‌లో, అతని బ్యాట్ 31 కంటే ఎక్కువ సగటుతో 664 పరుగులు చేసింది. టీ20ల విషయానికొస్తే.. అతడు 37 కంటే ఎక్కువ సగటుతో 1156 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 137 కంటే ఎక్కువ ఉంది. అలాగే ఈ సమయంలో ఒక సెంచరీ, 9 అర్ధ సెంచరీలు బాదేశాడు.