PM Narendra Modi: భారత ఆటగాళ్లను ఓదార్చిన ప్రధాని మోదీ.. ట్రూ లీడర్ అంటూ నెటిజన్ల ప్రశంసలు

భారత జట్టు వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచి ఫైనల్స్‌కు చేరుకుంది. కానీ, టైటిల్ మ్యాచ్‌ను గెలవలేకపోయింది. ఈ మ్యాచ్‌ చూసేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా వచ్చారు. భారత జట్టు ఓటమి తర్వాత, ప్రధాని మోదీ టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లను కలుసుకున్నారు. ఈ సమయంలో ఆటగాళ్లంతా భావోద్వేగంతో కనిపించారు. ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్లను ప్రధాని మోదీ తన మాటలతో స్థైర్యాన్ని నింపారు.

PM Narendra Modi: భారత ఆటగాళ్లను ఓదార్చిన ప్రధాని మోదీ.. ట్రూ లీడర్ అంటూ నెటిజన్ల ప్రశంసలు
Pm Modi

Updated on: Nov 20, 2023 | 5:51 PM

PM Narendra Modi: భారత క్రికెట్ జట్టు మరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించడంలో విఫలమైంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. టోర్నీ ఆద్యంతం టీమ్ ఇండియా అద్భుతంగా ఆడింది. ఈ ఓటమితో మొత్తం జట్టు నిరాశ చెందింది. భారత జట్టు వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచి ఫైనల్స్‌కు చేరుకుంది. కానీ, టైటిల్ మ్యాచ్‌ను గెలవలేకపోయింది. ఈ మ్యాచ్‌ చూసేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా వచ్చారు. భారత జట్టు ఓటమి తర్వాత, ప్రధాని మోదీ టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లను కలుసుకున్నారు. ఈ సమయంలో ఆటగాళ్లంతా భావోద్వేగంతో కనిపించారు. ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్లను ప్రధాని మోదీ తన మాటలతో స్థైర్యాన్ని నింపారు.

షమీని ఓదార్చిన ప్రధాని..

షమీ తన సోషల్ మీడియాలో మోడీని కౌగిలించుకున్న ఫొటోను పోస్ట్ చేశాడు. ఈ ఫొటోతో పాటు క్యాప్షన్‌లో, డ్రెస్సింగ్ రూమ్‌కి వచ్చి జట్టు ఆటగాళ్లను ఉత్సాహపరిచినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపాడు.

జడేజా కూడా..

భారత జట్టు స్పిన్నర్ రవీంద్ర జడేజా కూడా ప్రధాని మోదీతో దిగిన ఫొటోను షేర్ చేశాడు. టీమ్ ఇండియా టోర్నీ ఆసాంతం బాగా ఆడిందని, అయితే ఫైనల్స్‌లో జట్టు రాణించలేకపోయిందంటూ జడేజా రాసుకొచ్చాడు. దీంతో జట్టు నిరాశ చెందిందని, ఇటువంటి పరిస్థితిలో ప్రధాని మోదీ డ్రెస్సింగ్ రూమ్‌కి వచ్చి జట్టు ఆటగాళ్లను కలిశారని, ఇది చాలా ప్రేరణ కలిగించిందంటూ అందులో పేర్కొన్నాడు.

నిజమైన నాయకుడంటూ ట్వీట్ చేసిన నెటిజన్..

నాయకుడు చేయాల్సిందే ఇదే..

ఆనాడు చంద్రయాన్ 2లో.. నేడు టీమిండియా డ్రెస్సింగ్ రూంలో.. క్లిష్ట పరిస్థితుల్లో అండగా..

మోదీతోపాటే భారత్ అంతా టీమిండియా క్రికెటర్ల వైపే..

అండగా ప్రధాని మోదీ..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..