IPL 2023: ఐపీఎల్ వేలంలో నక్కతోక తొక్కాడు.. కట్ చేస్తే.. 47 బంతుల్లో తుఫాన్ ఇన్నింగ్స్..
ఏ జట్టుకైనా వికెట్ కీపర్‌తో పాటు విధ్వంసకర బ్యాటర్ కలిపి ఒక ప్యాకేజ్‌గా.. అది ఆ టీంకి భలే కిక్కిస్తుంది. సరిగ్గా ఢిల్లీ క్యాపిటల్స్ విషయంలోనూ ఇదే జరిగింది.
ఏ జట్టుకైనా వికెట్ కీపర్‌తో పాటు విధ్వంసకర బ్యాటర్ కలిపి ఒక ప్యాకేజ్‌గా.. అది ఆ టీంకి భలే కిక్కిస్తుంది. సరిగ్గా ఢిల్లీ క్యాపిటల్స్ విషయంలోనూ ఇదే జరిగింది. అటు వికెట్ కీపర్‌గా.. ఇటు విధ్వంసకర బ్యాటర్‌గా రిషబ్ పంత్ గత కొన్నాళ్లుగా ఆ ఫ్రాంచైజీకి బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం కారణంగా ఐపీఎల్ 2023కి రిషబ్ పంత్ పూర్తిగా దూరమయ్యాడు. ఇక ఇప్పుడు అతడి స్థానంలో కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ దాదాపుగా ఖరారు కాగా.. ఆ జట్టుకు విధ్వంసకర వికెట్ కీపర్‌గా ఫిల్ సాల్ట్.. అనుకోని అదృష్టంగా వేలంలో దొరికాడు.
ప్రస్తుతం దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడుతున్న ఫిల్ సాల్ట్.. ఢిల్లీ ఫ్రాంచైజీ ప్రిటోరియా క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ జట్టు గురువారం సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌తో తలబడింది. ఇందులో ఫిల్ సాల్ట్ తన బ్యాట్‌తో అద్భుత పెర్ఫార్మన్స్‌తో అదరగొట్టాడు. తన జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో క్యాపిటల్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. విల్ జాక్వెస్(6), రైల్ రస్సో(4), డి బ్రూనో(19), సెనూరన్ ముత్తుసామి(13), షేన్ డాడ్స్‌వెల్(0) వరుసగా తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. కానీ మరోవైపు ఫిల్ సాల్ట్ మాత్రం స్కోర్ బోర్డును పరుగులు పెట్టించడమే కాదు.. ఈ క్రమంలోనే తన అర్ధ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 47 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో అజేయంగా 77 పరుగులు చేశాడు.
ఇన్నింగ్స్ చివరి వరకు మరో ఎండ్‌లో ఫిల్ సాల్ట్ క్రీజులో ఉండి.. తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆఖర్లో జేమ్స్ నీషమ్ 28 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 37 పరుగులు చేశాడు. అలాగే కెప్టెన్ వైన్ పార్నెల్ కూడా చివర్లో తొమ్మిది బంతుల్లో 2 ఫోర్లు, మూడు సిక్సర్లతో 29 పరుగులు చేయడంతో క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.
అనంతరం 194 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టుకు ఆరంభం సరిగ్గా లభించలేదు. ఒకవైపు జేజే స్మట్స్(66) చెలరేగి ఆడుతున్నా.. మరోవైపు బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరారు. సరెల్ ఇర్వీ(1), జోర్డాన్ కాక్స్(5), కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్(5) తక్కువ పరుగులకే ఔట్ అయ్యారు. కేవలం 51 బంతుల్లోనే జేజే స్మట్స్ 66 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు 6 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు.
అలాగే ట్రిస్టన్ స్టబ్స్ 11 బంతుల్లో 23 పరుగులు, టామ్ అబెల్ 24 బంతుల్లో 40 పరుగులు, జేమ్స్ ఫుల్లర్ 12 బంతుల్లో 27 పరుగులు చేసినా.. సన్‌రైజర్స్ టార్గెట్ చేధించలేకపోయింది. తద్వారా క్యాపిటల్స్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.