Handshake Controversy : షేక్‌హ్యాండ్ వివాదంలో బరి తెగించిన పాకిస్తాన్.. ఐసీసీ మీద ఎదురుదాడికి రెడీ

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తన చేష్టలను ఆపడం లేదు. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్, పాకిస్థాన్ జట్టులోని కొంతమంది అధికారుల వీడియోను రికార్డు చేసే నిర్ణయాన్ని అది సమర్థించుకుంది. తాము చేసింది ఐసీసీ నియమాల ప్రకారమే అని పీసీబీ వాదిస్తోంది.

Handshake Controversy : షేక్‌హ్యాండ్ వివాదంలో బరి తెగించిన పాకిస్తాన్..  ఐసీసీ మీద ఎదురుదాడికి రెడీ
Handshake Controversy

Updated on: Sep 19, 2025 | 9:15 PM

Handshake Controversy : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తన చేష్టలను ఆపడం లేదు. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్, పాకిస్థాన్ జట్టులోని కొంతమంది అధికారుల వీడియోను రికార్డు చేసే నిర్ణయాన్ని అది సమర్థించుకుంది. తాము చేసింది ఐసీసీ నియమాల ప్రకారమే అని పీసీబీ వాదిస్తోంది.

ఐసీసీ, పీసీబీ మధ్య వివాదం

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రవర్తన ఐసీసీకి చిరాకు తెప్పిస్తోంది. ఇటీవల ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తా, పీసీబీకి ఒక లేఖ రాస్తూ.. అది ఆటగాళ్ళు, మ్యాచ్ అధికారుల నిబంధనలను ఉల్లంఘించిందని పేర్కొన్నారు. పాక్ టీమ్ హెడ్ కోచ్ మైక్ హెసన్, కెప్టెన్ సల్మాన్ అగా, మేనేజర్ నవీద్ అక్రమ్ చీమా కూర్చొని ఉన్న ఒక వీడియోలో వారి ముందు ఆండీ పైక్రాఫ్ట్ కూడా కూర్చుని ఉన్నారు.

ఈ వీడియోను అడ్డం పెట్టుకుని పీసీబీ ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో జరిగిన హ్యాండ్‌షేక్ వివాదం పై ఆండీ పైక్రాఫ్ట్ క్షమాపణలు చెప్పారని పీసీబీ ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే, దీనిపై ఐసీసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పైక్రాఫ్ట్ కేవలం అపార్థం జరిగినందుకు మాత్రమే విచారం వ్యక్తం చేశాడని, క్షమాపణలు చెప్పలేదని ఐసీసీ వివరణ ఇచ్చింది.

నిబంధనల ఉల్లంఘనపై పీసీబీ స్పందన

ఐసీసీ నిబంధనల ఉల్లంఘన గురించి అడిగినప్పుడు, పీసీబీ సమాధానం ఇచ్చింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం మీడియా మేనేజర్‌కు పీఎంఓఏ (ప్లేయర్ అండ్ మ్యాచ్ అఫీషియల్ ఏరియా)లో కెమెరా వాడటానికి అనుమతి ఉంటుందని, కాబట్టి ఆండీ పైక్రాఫ్ట్‌తో జరిగిన మీటింగ్‌లో మీడియా మేనేజర్ ఉండటం నిబంధనల ఉల్లంఘన కాదని పీసీబీ పేర్కొంది.

ఒకవేళ ఐసీసీకి ఇది నిబంధనల ఉల్లంఘన అని అనిపిస్తే, ఈ కేసును నేరుగా యాంటీ-కరప్షన్ యూనిట్‌కు ఎందుకు పంపించలేదని కూడా పీసీబీ ప్రశ్నించింది. గతంలో యూఏఈతో మ్యాచ్ ఆడటానికి నిరాకరించి, నిబంధనలను పట్టించుకోనిది కూడా ఇదే పాకిస్థాన్. ఆ తర్వాత ఒక గంటలోనే సిగ్గు లేకుండా మైదానంలోకి దిగింది.

ఈ మొత్తం వివాదం భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లోని టాస్ సమయంలో మొదలైంది. ఆ సమయంలో సూర్యకుమార్ యాదవ్ పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అగాతో కరచాలనం చేయలేదు. అలాగే, 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత భారత జట్టు పాకిస్థాన్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ చేయలేదు.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..