Champions Trophy: భారత అభిమానులకు గుడ్‌న్యూస్.. ఛాంపియన్స్ ట్రోఫీపై పాక్ కీలక నిర్ణయం

|

Nov 02, 2024 | 10:18 AM

ICC Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్తాన్ ఆతిథ్యమివ్వనున్న షెడ్యూల్‌ను ఐసీసీ ఇంకా ప్రకటించలేదు. నిజానికి, టీమ్ ఇండియా పాకిస్థాన్‌లో పర్యటిస్తుందా లేదా అనేది ఇప్పటి వరకు సమాచారం లేదు. మరోవైపు భారత అభిమానుల కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

Champions Trophy: భారత అభిమానులకు గుడ్‌న్యూస్.. ఛాంపియన్స్ ట్రోఫీపై పాక్ కీలక నిర్ణయం
Ind Vs Pak
Follow us on

ICC Champions Trophy 2025: తదుపరి ICC టోర్నమెంట్ ఛాంపియన్స్ ట్రోఫీ. దీనికి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2025 ప్రారంభంలో జరిగే ఈ టోర్నీ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీవ్రంగా సన్నాహాలు చేస్తోంది. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్ వెళ్లే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. భారత్-పాక్‌ల మధ్య సంబంధాలు అంతగా లేకపోవడమే ఇందుకు కారణం. పాకిస్థాన్‌లో భద్రతాపరమైన ముప్పు ఉన్నప్పటికీ.. ఈ టోర్నీకి టీమిండియా తమ దేశానికి వస్తుందని పీసీబీ ఆశాభావం వ్యక్తం చేసింది. వీటన్నింటి మధ్య భారత అభిమానుల కోసం పీసీబీ కీలక నిర్ణయం తీసుకుంది.

భారత అభిమానుల కోసం పీసీబీ కీలక నిర్ణయం..

వచ్చే ఏడాది జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లను చూసేందుకు తమ దేశానికి రావాలనుకునే భారత అభిమానులకు త్వరితగతిన వీసాలు మంజూరు చేస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్, కేంద్ర ప్రభుత్వంలో మంత్రి మొహ్సిన్ నఖ్వీ హామీ ఇచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లను చూసేందుకు భారత క్రికెట్ ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాకిస్థాన్‌కు వస్తారని పీసీబీ ఆశాభావంతో ఉందని నఖ్వీ చెప్పుకొచ్చాడు. లాహోర్‌లో ఈ రెండు దేశాల మధ్య జరిగే మ్యాచ్‌ని భారత అభిమానులు పాకిస్థాన్‌కు వచ్చి వీక్షించాలని కోరుతున్నాడు. ‘భారతీయ అభిమానుల కోసం ప్రత్యేక టిక్కెట్ల కోటాను ఉంచుతాం, వీలైనంత త్వరగా వీసాలు జారీ చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటాం’ అని నఖ్వీ చెప్పినట్లు ఓ వార్తాపత్రిక పేర్కొంది.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 వేదికను మార్చవచ్చు..

భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు చాలా కాలంగా బాగా లేవు. దీని కారణంగా భారత జట్టు ఈ దేశంలో పర్యటించలేదు. ఐసీసీ టోర్నమెంట్లు, ఆసియా కప్ సమయంలో మాత్రమే భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లు జరుగుతాయి. ఇటువంటి పరిస్థితిలో, ఈ టోర్నమెంట్‌ను హైబ్రిడ్ మోడల్‌లో ఆడవచ్చని నమ్ముతున్నారు. ఇదే జరిగితే, టీమ్ ఇండియా తన గ్రూప్ దశ మ్యాచ్‌లన్నింటినీ పాకిస్థాన్ వెలుపల ఆడుతుంది. సెమీ-ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ, వేదికలో మార్పులు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం రెండు సెమీఫైనల్‌లు పాకిస్థాన్‌లో మాత్రమే జరగాల్సి ఉంది.

మరోవైపు ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ లాహోర్‌లో జరగనుంది. అయితే టీమ్ ఇండియా ఫైనల్‌కు చేరితే, ఫైనల్ మ్యాచ్‌ను పాకిస్థాన్ వెలుపల కూడా నిర్వహించవచ్చు. ఈ మ్యాచ్ దుబాయ్‌లో జరిగే అవకాశం ఉంది. అయితే, ఈ టోర్నీ షెడ్యూల్‌ను ఐసీసీ ఇంకా ప్రకటించలేదు. అదే సమయంలో, డ్రాఫ్ట్ షెడ్యూల్ ప్రకారం, టీమ్ ఇండియా తన అన్ని మ్యాచ్‌లను లాహోర్‌లో ఆడాల్సి ఉంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో టీమిండియా తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న న్యూజిలాండ్‌తో రెండో మ్యాచ్ ఆడనుంది. అదే సమయంలో, గ్రూప్ దశలో మూడవ, చివరి మ్యాచ్ మార్చి 1న పాకిస్థాన్‌తో ఆడనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..