Punjab Kings vs Rajasthan Royals Highlights in Telugu: ఐపీఎల్-2022 కీలక దశకు చేరుకుంది. ముంబయి, చెన్నై మినహా ప్లే ఆఫ్‌కు చేరుకోవాలంటే అన్ని జట్లకు ప్రతి మ్యాచ్ కీలకమే. ఈక్రమంలో నేడు (మే7) జరిగే డబుల్ హెడర్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ (PBKS vs RR) జట్లు తలపడనున్నాయి. సంజు శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్‌లో అద్భుతంగా ఆడుతోంది. మొత్తం12 పాయింట్లతో ప్లే ఆఫ్‌కు చేరువలో ఉంది. అదే సమయంలో పంజాబ్ జట్టు 10 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఈక్రమంలో ప్లే ఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ఇరు జట్లకు తప్పనిసరి.
ఇరు జట్ల ప్లేయింగ్ – XI :
పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ XI:
మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, భానుక రాజపక్సే, లియామ్ లివింగ్‌స్టన్, జితేష్ శర్మ, రిషి ధావన్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, సందీప్ శర్మ
రాజస్థాన్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గత రెండు మ్యాచ్‌ల్లో ఎదురైన ఓటములను అధిగమిస్తూ పంజాబ్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టు విధించిన 190 పరుగుల లక్ష్యాన్ని మరో రెండు బంతులు ఉండగానే అందుకుంది. యశస్వి జైస్వాల్ (68) RR విజయంలో కీలక పాత్ర పోషించాడు.
శామ్సన్ సేన నాలుగో వికెట్ కోల్పోయింది. దేవ్‌దత్ పడిక్కల్ (31) అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
రాజస్థాన్ మరో విజయానికి చేరువలో నిలిచింది. 190 పరుగుల లక్ష్య ఛేదనలో 18 ఓవర్లు ముగిసే సరికి 179 పరుగులు చేసింది. ఆ జట్టు విజయానికి 12 బంతుల్లో కేవలం 11 పరుగులు మాత్రమే అవసరం.
రాజస్థాన్ స్కోరు 150 పరుగులు దాటింది. క్రీజులో పడిక్కల్ (18), హెట్మెయర్ (6) ఉన్నాడు. RR విజయానికి ఇంకా 26 బంతుల్లో 40 పరుగులు అవసరం.
దూకుడుగా ఆడుతున్న యశస్వి జైస్వాల్ (68)ను ఔట్ చేసి పంజాబ్‌కు బ్రేక్ ఇచ్చాడు యశస్వి జైస్వాల్. దీంతో ఆ జట్టు 141 వద్ద మూడో వికెట్ కోల్పోయింది. RR విజయానికి ఇంకా 34 బంతుల్లో 49 పరుగులు అవసరం.
యశస్వి జైస్వాల్ అదరగొడుతున్నాడు. ఓపెనర్‌గా వచ్చిన ఈ యంగ్‌స్టర్ 35 బంతుల్లో 55 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. 12.4 ఓవర్లు ముగిసే సరికి RR స్కోరు 119/2.
రాజస్థాన్ స్కోరు వంద దాటింది. యశస్వి జైస్వాల్ (45) అర్ధ సెంచరీకి చేరువలో ఉండగా.. దేవ్‌దత్ పడిక్కల్ (4) క్రీజులో ఉన్నాడు. 10.3 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు స్కోరు 104/2.
ధాటిగా ఆడుతున్న సంజూ శామ్సన్ (12 బంతుల్లో 23) ఔటయ్యాడు. రిషి ధావన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి శిఖర్ చేతికి చిక్కాడు. 8.2 ఓవర్లు ముగిసే సరికి ఆజట్టు స్కోరు 86/2.
రాజస్థాన్ బ్యాటర్లు యశస్వి జైస్వాల్ (15 బంతుల్లో 22), శామ్సన్ (8 బంతుల్లో 20) బౌండరీల వర్షం కురిపిస్తున్నారు. 7 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు స్కోరు 74/1.
రాజస్థాన్ మొదటి వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న బట్లర్ (16 బంతుల్లో 30, 5 ఫోర్లు, సిక్సర్)ను రబాడా ఔట్ చేశాడు. మరో ఓపెనర్ జైస్వాల్ (16) నిలకడగా ఆడుతున్నాడు. 4 ఓవర్లు ముగిసే సరికి RR స్కోరు 46/1.
190 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ దూకుడుగా ఆడుతోంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (8 బంతుల్లో 16) ధాటిగా ఆడుతుండగా.. బట్లర్ (5) ఆచితూచి ఆడుతున్నాడు. 2.5 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు స్కోరు 25/0.
జితేశ్ శర్మ (18 బంతుల్లో 38 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) చివర్లో మెరుపులు మెరిపించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.
ధాటిగా ఆడుతున్న లివింగ్ స్టోన్ (12)ను ప్రసిద్ధ్ కృష్ణ బౌల్డ్ చేశాడు. దీంతో పంజాబ్ 5 వికెట్ కోల్పోయిది. 18.5 ఓవర్లకు పంజాబ్ స్కోరు 169/5.
పంజాబ్ స్కోరు 150 పరుగులు దాటింది. జితేశ్ శర్మ (21), లివింగ్ స్టోన్ (10) ధాటిగా ఆడుతున్నారు.17.2 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు స్కోరు 154/4.
స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ పంజాబ్‌కు చుక్కలు చూపిస్తున్నాడు. నిలకడగా ఆడుతున్న బెయిర్‌స్టో (56) ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న అతను ఇప్పటివరకు మొత్తం మూడు వికెట్లు పడగొట్టాడు.
రాజస్థాన్ స్పిన్నర్ చాహల్ పంజాబ్‌కు మళ్లీ షాక్ ఇచ్చాడు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (15)ను పెవిలియన్‌కు పంపించాడు. ప్రస్తుతం ఆ జట్టు స్కోరు 14.3 ఓవర్లలో 119/3.
పంజాబ్ స్కోరు వంద దాటింది. జానీ బెయిర్‌స్టో (50) అర్ధసెంచరీ చేయగా..కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (12) తోడుగా ఉన్నాడు. 12.4 ఓవర్లలో పంజాబ్ స్కోరు 107/2.
పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న భానుక రాజపక్సే (27)చాహల్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు..
పంజాబ్ బ్యాటర్లు దూకుడు పెంచారు. బెయిర్ స్టో (23 బంతుల్లో 38), భానుక రాజపక్సే (13 బంతుల్లో 17) స్కోరుబోర్డును పరుగులెత్తిస్తున్నారు. 9 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ స్కోరు 76/1.
పంజాబ్ మొదటి వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్ (12) బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. పవర్ ప్లే ముగిసే సరికి పంజాబ్ స్కోరు 48/1.
రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తున్నారు. దీంతో పంజాబ్ బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. బెయిర్‌స్టో (12 బంతుల్లో 20) ధాటిగా ఆడుతుండగా ధావన్ (13 బంతుల్లో 7) నెమ్మదిగా ఆడుతున్నాడు. 4.3 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ స్కోరు 34/0.
పంజాబ్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధావన్‌లు ఇన్నింగ్స్ ఆరంభించారు. రాజస్థాన్ తరఫున ట్రెంట్ బౌల్ట్ మొదట బంతిని అందుకున్నాడు.
రాజస్థాన్ తన తుది జట్టులో మార్పులు చేసింది. కరుణ్ నాయర్ స్థానంలో యశస్వి జైస్వాల్‌కు అవకాశం కల్పించింది. పంజాబ్ జట్టు గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగింది.