IPL 2022, PBKS vs GT: శిఖర్ ధావన్ శుక్రవారం టీ20 క్రికెట్‌లో 1000 బౌండరీలు కొట్టిన మొదటి భారతీయుడిగా మారాడు. అలాగే ఈ మైలురాయిని అందుకున్న 5వ బ్యాటర్‌గా నిలిచాడు. ముంబైలో గుజరాత్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో పంజాబ్ తరపున ధీటుగా ఆరంభించాడు. ఈ క్రమంలోనే ధావన్ ఈ ఫీట్ సాధించాడు. టీ20 క్రికెట్‌లో 1,000 బౌండరీలు పూర్తి చేసిన తొలి భారత బ్యాటర్‌గా శిఖర్ ధావన్ శుక్రవారం చరిత్ర సృష్టించి, వెస్టిండీస్ గ్రేట్ క్రిస్ గేల్‌తో సహా ఎలైట్ క్రికెటర్ల జాబితాలో చేరాడు. కాగా, ఈ భారత ఓపెనర్ ప్రపంచ క్రికెట్‌లో మొత్తంగా 5వ బ్యాటర్‌గా మారాడు.
శుక్రవారం తన 307వ టీ20 మ్యాచ్‌ని ఆడుతున్న శిఖర్ ధావన్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022లో తన కొత్త ఫ్రాంచైజీ అయిన పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతూ ఈ మైలురాయిని సాధించాడు.
ఈ మ్యాచ్‌కు ముందు ఈ కీలక మైలురాయికి మరో 3 బౌండరీల దూరంలో నిలిచిన ధావన్.. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ధావన్ ఇన్‌సైడ్ ఎడ్జ్‌తో తన ఖాతా తెరిచాడు. ఆ తర్వాత మహ్మద్ షమీ వేసిన 2వ ఓవర్‌లో మరో బౌండరీకి దూసుకెళ్లడంతో ధావన్‌కు అదృష్టం కలిసి వచ్చింది. గుజరాత్ టైటాన్స్ పేసర్ వేసిన తొలి ఓవర్‌లోనే ధావన్ లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో దాడి చేసి ఈ మైలురాయిని అందుకున్నాడు.
అత్యధిక ఫోర్‌లు బాదిన భారతీయులు..
1001: శిఖర్ ధావన్
917: విరాట్ కోహ్లీ
875: రోహిత్ శర్మ
779: సురేష్ రైనా
ధావన్ టీ20 క్రికెట్‌లో 8850కి పైగా పరుగులు చేశాడు. 36 ఏళ్ల అతను 2011లో T20I లలో భారత్ తరపున అరంగేట్రం చేయడానికి ముందు 2007లో ఢిల్లీ తరపున అరంగేట్రం చేశాడు.
Also Read: David Warner: సల్లూభాయ్‌గా మారిపోయిన వార్నర్.. దిశాపటానీతో డ్యాన్స్.. వైరల్‌గా మారిన వీడియో..