PBKS vs GT, IPL 2022: గుజరాత్ టార్గెట్ 190.. దుమ్మురేపిన పంజాబ్.. లివింగ్‌స్టోన్, చాహర్ తుఫాన్ బ్యాటింగ్‌

|

Apr 08, 2022 | 9:36 PM

టాస్ ఓడిన పంజాబ్ కింగ్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ముందు 190 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. లివింగ్‌స్టోన్ 64 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

PBKS vs GT, IPL 2022: గుజరాత్ టార్గెట్ 190.. దుమ్మురేపిన పంజాబ్..  లివింగ్‌స్టోన్, చాహర్ తుఫాన్ బ్యాటింగ్‌
Ipl 2022, Pbks Vs Gt
Follow us on

IPL 2022 17వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS)తో జరుగుతోన్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టాస్ ఓడిన పంజాబ్ కింగ్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ముందు 190 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. లివింగ్‌స్టోన్ 64 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శిఖర్ ధావన్ 35, జితేష్ శర్మ 23, షారుక్ ఖాన్ 15 పరుగులు చేశారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అియతే చివర్లో రాహుల్ చాహర్ 22, అర్షదీప్ సింగ్ 10 పరుగులతో కీలక భాగస్వామ్యాన్ని అందించారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3, నల్కండే 2, షమీ, పాండ్యా, ఫెర్గ్యూసేన్ తలో వికెట్‌ను పడగొట్టారు.

దర్శన్ హ్యాట్రిక్ మిస్..

ఐపీఎల్‌లో అరంగేట్రం చేస్తున్న గుజరాత్ యువ ఫాస్ట్ బౌలర్ దర్శన్ నల్కండే వరుసగా 2 బంతుల్లో 2 వికెట్లు తీశాడు. 13వ ఓవర్లో జితేష్ శర్మ (23)ను అవుట్ చేశాడు. తర్వాతి బంతికి ఓడియన్ స్మిత్ కూడా భారీ షాట్ కొట్టి పెవిలియన్ చేరాడు. రెండు క్యాచ్‌లను లాంగ్ ఆఫ్‌లో శుభ్‌మన్ గిల్ పట్టుకున్నాడు. అయితే దర్శన్ హ్యాట్రిక్ పూర్తి చేయలేకపోయాడు.

1000 ఫోర్లు పూర్తి చేసిన ధావన్..

ఈ మ్యాచ్‌లో శిఖర్ ధావన్ 3 ఫోర్లు కొట్టడం ద్వారా మొత్తం T20 క్రికెట్‌లో 1,000 ఫోర్లు పూర్తి చేశాడు. ఈ రికార్డు సాధించిన తొలి భారతీయుడు, ప్రపంచంలో 5వ ఆటగాడిగా ధావన్ నిలిచాడు. ఈ ఫార్మాట్‌లో అత్యధిక ఫోర్లు బాదిన ఆటగాడిగా క్రిస్ గేల్ (1132) రికార్డు సృష్టించాడు. అదే సమయంలో విరాట్ కోహ్లి (917), రోహిత్ శర్మ (875) ఫోర్లు సాధించారు.

ధావన్, లివింగ్‌స్టోన్‌ల కీలక భాగస్వామ్యం..

పంజాబ్ కింగ్స్ 34 పరుగుల స్కోరు వద్ద తొలి రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్ మూడో వికెట్‌కు 52 పరుగులు జోడించి జట్టును మళ్లీ మ్యాచ్‌లోకి తీసుకొచ్చారు. అర్ధసెంచరీ దిశగా సాగుతున్న ధావన్ 30 బంతుల్లో 35 పరుగులు చేసి రషీద్ చేతిలో ఔటయ్యాడు. అతని క్యాచ్‌ను వికెట్ వెనుక మాథ్యూ వేడ్ క్యాచ్ పట్టాడు.

లియామ్‌కు భారీ లైప్..

రషీద్ ఖాన్‌పై పంజాబ్ ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో, లియామ్ లివింగ్‌స్టోన్ డీప్ మిడ్ వికెట్ వద్ద భారీ షాట్ ఆడాడు. అయితే హార్దిక్ పాండ్యా అతని అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. మైదానంలో ఉన్న అంపైర్ థర్డ్ అంపైర్ సహాయం తీసుకోగా, క్యాచ్ తీసుకుంటున్న సమయంలో హార్దిక్ పాదం బౌండరీ లైన్‌ను తాకినట్లు రీప్లేల్లో కనిపించింది. లియామ్ నాటౌట్‌గా నిలిచాడు. ఆ సమయంలో అతను 14 పరుగులతో ఉన్నాడు.

పవర్ ప్లేలో పంజాబ్ 2 వికెట్లు కోల్పోయిన పంజాబ్..

తొలి 6 ఓవర్లలో పీబీకేఎస్ 2 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. పంజాబ్ కెప్టెన్ మయాంక్ (5), జానీ బెయిర్‌స్టో 8 బంతుల్లో 8 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నారు. అతని క్యాచ్‌ను షార్ట్ థర్డ్ మ్యాన్ వద్ద రాహుల్ టియోటియా క్యాచ్ పట్టాడు. పవర్ ప్లేలో పీబీకేఎస్ 8 ఫోర్లు కొట్టింది.

మయాంక్ మళ్లీ ఫ్లాప్..

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేయడం పంజాబ్‌కు కలిసిరాలేదు. రెండో ఓవర్ చివరి బంతికి కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 9 బంతుల్లో 5 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా ఔటయ్యాడు. అతని క్యాచ్‌ను షార్ట్ మిడ్ వికెట్ వద్ద రషీద్ ఖాన్ పట్టుకున్నాడు. ఈ సీజన్‌లో మయాంక్ 4 ఇన్నింగ్స్‌ల్లో 42 పరుగులు మాత్రమే చేశాడు.

ప్లేయింగ్ XIలో మార్పులు..

జానీ బెయిర్‌స్టో PBKS కోసం తన మొదటి మ్యాచ్‌ని ఆడుతున్నాడు. భానుక రాజపక్సే స్థానంలో ప్లేయింగ్ ఎలెవన్‌లో అతనికి అవకాశం లభించింది. అదే సమయంలో, గుజరాత్ టైటాన్స్ టీం విజయ్ శంకర్, వరుణ్ ఆరోన్ స్థానంలో దర్శన్ నలకండే, సాయి సుదర్శన్‌లను ప్లేయింగ్ XIలో చేర్చారు.

ప్లేయింగ్ XI

పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, షారుఖ్ ఖాన్, జితేష్ శర్మ (WK), ఒడియన్ స్మిత్, అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబడ, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా.

గుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్, మాథ్యూ వేడ్ (WK), దర్శన్ నల్కండే, హార్దిక్ పాండ్యా (c), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, సాయి సుదర్శన్, మహమ్మద్ షమీ.

Also Read: