Australia: వరల్డ్ కప్‌ ట్రోఫీతో స్వదేశానికి ఆసీస్ క్రికెటర్లు.. పట్టించుకోని ఫ్యాన్స్.. వైరల్ వీడియో..

Pat Cummins Video: పాట్ కమిన్స్ ప్రపంచకప్ గెలవడమే కాకుండా ఈ ఏడాది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను కూడా గెలుచుకున్నాడు. ఈ ఫైనల్‌లో కూడా ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించింది. పాట్ కమిన్స్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా జట్టు అత్యద్భుతంగా దూసుకుపోతోంది. తాజాగా ఇంగ్లండ్‌లో ఆడిన యాషెస్ సిరీస్‌ను కూడా నిలబెట్టుకున్నాడు. పాట్ కమిన్స్ 2023 ప్రపంచ కప్‌లో బంతి, బ్యాట్‌తో ముఖ్యమైన సహకారాన్ని అందించాడు. 11 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీయడమే కాకుండా, కమిన్స్ 32 సగటుతో 128 పరుగులు చేశాడు.

Australia: వరల్డ్ కప్‌ ట్రోఫీతో స్వదేశానికి ఆసీస్ క్రికెటర్లు.. పట్టించుకోని ఫ్యాన్స్.. వైరల్ వీడియో..
Aus Skipper Pat Cummins

Updated on: Nov 22, 2023 | 4:26 PM

Pat Cummins Video: పాట్ కమిన్స్.. ప్రస్తుతం ఈ పేరు ప్రపంచ క్రికెట్‌లో ప్రసిద్ధి చెందింది. ఈ ఆటగాడి సారథ్యంలోనే ఆస్ట్రేలియా ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో టీమిండియాను ఓడించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో వేలాది మంది భారత అభిమానుల సమక్షంలో, ఫైనల్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. ఈ చారిత్రాత్మక విజయంలో కమిన్స్‌ కూడా తనవంతు సహకారం అందించాడు. అయితే, ప్రపంచకప్ గెలిచిన తర్వాత, పాట్ కమిన్స్‌కు ఎదురైన ఓ సంఘటన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల అభిమానులను కూడా ఆశ్చర్యపరుస్తుంది.

కమిన్స్‌కు ఏం జరిగింది?

పాట్ కమిన్స్‌కు ఏమి జరిగిందో ఇప్పుడు చూద్దాం? ప్రపంచకప్ గెలిచి పాట్ కమిన్స్ తన దేశానికి తిరిగి చేరుకున్నాడు. అయితే, విమానాశ్రయంలో అతనికి స్వాగతం పలికేందుకు ఎవరూ లేరు. అక్కడ కొంతమంది మాత్రమే నిలబడి ఉన్నారు. కొంతమంది క్రికెట్ జర్నలిస్టులు ఫొటోలు తీస్తున్నారు. ప్రపంచ ఛాంపియన్ కెప్టెన్‌కి ఈ విధమైన స్వాగతం పలకడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే, భారత జట్టు ఈ ప్రపంచకప్ గెలిచినట్లయితే, ఇక్కడ టీమిండియా ఆటగాళ్లు, కెప్టెన్ రోహిత్ శర్మకు ఎంత గౌరవం లభించేదో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఆస్ట్రేలియా సంస్కృతి భిన్నంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఒక్క ఏడాదిలో రెండు ఐసీసీ ట్రోఫీలు..

పాట్ కమిన్స్ ప్రపంచకప్ గెలవడమే కాకుండా ఈ ఏడాది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను కూడా గెలుచుకున్నాడు. ఈ ఫైనల్‌లో కూడా ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించింది. పాట్ కమిన్స్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా జట్టు అత్యద్భుతంగా దూసుకుపోతోంది. తాజాగా ఇంగ్లండ్‌లో ఆడిన యాషెస్ సిరీస్‌ను కూడా నిలబెట్టుకున్నాడు.

కమిన్స్ పనితీరు..

పాట్ కమిన్స్ 2023 ప్రపంచ కప్‌లో బంతి, బ్యాట్‌తో ముఖ్యమైన సహకారాన్ని అందించాడు. 11 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీయడమే కాకుండా, కమిన్స్ 32 సగటుతో 128 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా సెమీ-ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లను గెలవడంలో కమిన్స్ కీలక పాత్ర పోషించాడు. ఇది కాకుండా, అతను తన జట్టును ఓటమి నుంచి కాపాడాడం ద్వారా ఆఫ్ఘనిస్తాన్‌పై చారిత్రాత్మక విజయాన్ని సాధించాడు. ఇటువంటి పరిస్థితిలో, ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఈ ఆటగాడికి అద్భుతమైన స్వాగతం లభించింది. కానీ, ఆస్ట్రేలియాలో ప్రజలు భిన్నమైన ఆలోచనతో ఉన్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..