Pat Cummins: ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు కెప్టెన్‎గా పాట్ కమిన్స్.. వైస్ కెప్టెన్‎గా స్టీవ్ స్మిత్..

|

Nov 26, 2021 | 9:16 AM

ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు కెప్టెన్‎గా పాట్ కమిన్స్‎ను క్రికెట్ ఆస్ట్రేలియా శుక్రవారం నియమించింది. వైస్ కెప్టెన్‎గా స్టీవ్ స్మిత్ ఎంపికయ్యాడు. మాజీ కెప్టెన్ టిమ్ పైన్ వైదొలడంతో టెస్ట్ జట్టు కెప్టెన్సీ పదవి ఖాళీ అయింది....

Pat Cummins: ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు కెప్టెన్‎గా పాట్ కమిన్స్.. వైస్ కెప్టెన్‎గా స్టీవ్ స్మిత్..
Cummins
Follow us on

ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు కెప్టెన్‎గా పాట్ కమిన్స్‎ను క్రికెట్ ఆస్ట్రేలియా శుక్రవారం నియమించింది. వైస్ కెప్టెన్‎గా స్టీవ్ స్మిత్ ఎంపికయ్యాడు. మాజీ కెప్టెన్ టిమ్ పైన్ వైదొలడంతో టెస్ట్ జట్టు కెప్టెన్సీ పదవి ఖాళీ అయింది. యాషెస్ సిరీస్‌కు రెండు వారాల కంటే తక్కువ సమయం ఉండటంతో టెస్ట్ జట్టును నడిపించే బాధ్యతను క్రికెట్ ఆస్ట్రేలియా కమిన్స్‌కు అప్పగించింది. 28 ఏళ్ల కమ్మిన్స్ ఆస్ట్రేలియా టెస్ట్ జట్టుకు 47వ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 1950లో టెస్టుకు నాయకత్వం వహించిన రే లిండ్‌వాల్ తర్వాత కెప్టెన్సీని తీసుకున్న రెండవ స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్‎గా కమిన్స్ నిలిచాడు.

“భారీ యాషెస్ ముందు కెప్టెన్‎గా నియమించడం నాకు గౌరవంగా ఉంది” అని కమిన్స్ ఒక ప్రకటనలో తెలిపారు. “గత కొన్నేళ్లుగా టిమ్ (పైన్) సమూహానికి అందించిన నాయకత్వాన్ని నేను అందించగలనని ఆశిస్తున్నాను. స్టీవ్ స్మిత్ వైస్ కెప్టెన్, నేను కెప్టెన్‌లుగా ఈ జట్టుతో కలిసి పని చేస్తాం. జట్టులో సీనియర్ ఆటగాళ్లు, కొంతమంది గొప్ప యువ ప్రతిభావంతులతో బంగా ఉన్నాం. ” అని చెప్పాడు. 2018 లో బాల్
ట్యాంపరింగ్ కుంభకోణం నేపథ్యంలో 12 నెలల నిషేధం ఎదుర్కొన్నాడు. ఇతడికి ఇప్పుడు వైస్ కెప్టెన్సీ వచ్చింది.

“నేను జట్టు నాయకత్వానికి తిరిగి రావడం సంతోషంగా ఉంది. నేను చేయగలిగిన విధంగా పాట్‌కు సహాయం చేయడానికి ఎదురుచూస్తున్నాను” అని స్మిత్ ఒక ప్రకటనలో తెలిపారు. “పాట్, నేను చాలా కాలం పాటు కలిసి ఆడాము. కాబట్టి మాకు మా స్టైల్స్ బాగా తెలుసు. మేము కూడా గొప్ప స్నేహితులం. ఒక జట్టుగా మేము మంచి, సానుకూల క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నాము.” అని స్మిత్ చెప్పాడు. పైన్ తప్పుకున్న తర్వాత
స్మిత్‎కు కెప్టెన్సీ వస్తుందని క్రికెట్ పండితులు భావించారు. “పాట్ కమ్మిన్స్ ఆ జట్టులో మరింత అంతర్భాగంగా అభివృద్ధి చెందాడని నేను భావిస్తున్నాను. అతనికి ఆట, అనుభవాలపై అతని జ్ఞానం పెరిగింది” అని ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ గత వారం రాయిటర్స్‌తో అన్నారు.

Read Also.. Tim Paine: క్రికెట్‎కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న టిమ్ పైన్..! ఎందుకంటే..