T20 World Cup 2021: డూ ఆర్ డై అన్న మ్యాచ్‌లో పాకిస్తాన్ అద్భుత ఆటతీరును కనబరించింది. ఈ టీ20 వరల్డ్ కప్‌లో తొలి నుంచి అపజయం అంటూ లేకుండా దూసుకుపోతున్న పాకిస్తాన్ దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో సెమీఫైనల్‌లోనూ రాణించింది. పాక్ బ్యాట్స్‌మెన్ అద్భుత ఆటతీరును కనబరచడంతో నిర్ణీత 20 ఓవర్‌లలో 176 పరుగులు సాధించింది. దీంతో ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరాలంటే 177 పరుగులు చేయాల్సి ఉంది. బౌలింగ్‌కు అనుకూలించే బౌన్సీ పిచ్‌పై పాక్ ఈ స్థాయిలో రాణించడం విశేషంగా చెప్పవచ్చు.
ఇక పాకిస్తాన్ బ్యాటింగ్ విషయానికొస్తే తొలి నుంచి అద్భుత ఆటతీరును కనబరుస్తోన్న ఓపెనర్లు బాబర్ అజమ్, రిజ్వాన్‌లు ఈ కీలక మ్యాచ్‌లో కూడా రాణించారు. వీరిద్దరూ ఏకంగా 71 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని అందించారు. ఈ క్రమంలోనే 34 బంతుల్లో 39 పరుగులు సాధించిన బాబర్ అజమ్ టీ20లో 2500 పరుగుల ఫీట్‌ను సాధించాడు. ఇక మరో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 52 బంతుల్లో 67 పరుగులు చేసి జట్టును స్కోరును పెంచాడు. వీరిద్దరి తోడుగా ఫఖర్ జమాన్ కూడా రెచ్చిపోయాడు.
కేవలం 32 బంతుల్లో 55 పరుగులు సాధించడంతో పాటు హాప్ సెంచరీని పూర్తి చేశాడు. దీంతో పాక్ నిర్ణీత 20 ఓవర్‌లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా ముందు 177 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇవ్వగలిగింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్ల విషయానికొస్తే మిచెల్ స్టార్క్ 2, జంపా 1, కుమ్మిన్స్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.
Also Read: CM KCR: ఉద్యోగుల సర్దుబాటు తర్వాత ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు.. టీజీవో నేతలకు సీఎం కేసీఆర్ హామీ
Mallika Sherawat: పాట కోసం నా నడుముపై చపాతీలు వేడిచేస్తానన్నాడు.. మల్లిక ఆసక్తికర వ్యాఖ్యలు..
GHMC: గ్రేటర్ వాసులకు గుడ్‌న్యూస్.. దోమల విముక్తి డ్రోన్లతో యుద్ధం.. జీహెచ్ఎంసీ వినూత్న కార్యక్రమం