NZ vs PAK: రికార్డ్ బ్రేకింగ్ ‘సెంచరీ’తో సత్తా చాటిన బాబర్-రిజ్వాన్.. టీ20 ప్రపంచకప్‌లో ఏకంగా 9వసారి..

|

Nov 09, 2022 | 7:59 PM

టీ20 ప్రపంచకప్ తొలి సెమీ-ఫైనల్స్‌లో బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ జోడీ 105 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. దీంతో పాక్ జట్టు ఫైనల్ టికెట్ దక్కించుకుంది.

NZ vs PAK: రికార్డ్ బ్రేకింగ్ సెంచరీతో సత్తా చాటిన బాబర్-రిజ్వాన్.. టీ20 ప్రపంచకప్‌లో ఏకంగా 9వసారి..
Babar Rizwan
Follow us on

బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ జోడీ ఎట్టకేలకు టీ20 ప్రపంచ కప్ 2022 తొలి సెమీస్‌లో సత్తా చాటారు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇద్దరు ఆటగాళ్లు అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టును గెలిపించారు. పాకిస్థాన్ విజయంలో బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ అద్భుత ‘సెంచరీ’ భాగస్వామ్యం అందించారు. సిడ్నీ గడ్డపై బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ అద్భుత సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 105 పరుగులు జోడించారు. ఈ సెంచరీ భాగస్వామ్యంతో బాబర్-రిజ్వాన్ ప్రపంచ రికార్డు కూడా సృష్టించారు.

టీ20 ప్రపంచకప్ చరిత్రలో మూడుసార్లు 100కు పైగా పరుగులు చేసిన తొలి ఆటగాళ్లు రిజ్వాన్-బాబర్. అంతే కాదు టీ20 ఇంటర్నేషనల్‌లో వీరిద్దరూ 9వ సారి సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేయడం ప్రపంచ రికార్డుగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

సిడ్నీలో బాబర్ ఆజం 38 బంతుల్లో 54 పరుగులు చేశాడు. అతని బ్యాట్ నుంచి 7 ఫోర్లు వచ్చాయి. ఈ టీ20 ప్రపంచకప్ 2022లో అతడికి ఇది తొలి అర్ధ సెంచరీ.

మొహమ్మద్ రిజ్వాన్ 2022 టీ20 ప్రపంచ కప్‌లో తన మొదటి అర్ధ సెంచరీని కూడా సాధించాడు. రిజ్వాన్ 36 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. బాబర్ ఔటైన తర్వాత కూడా క్రీజులో కొనసాగుతూ పాకిస్థాన్‌కు ఫైనల్‌ టికెట్ అందించాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..