T20 World Cup 2021: ‘గేమ్ ఛేంజింగ్’ క్యాచ్‌‌కు పాక్ ఆటగాడు బలి.. నెట్టింట్లో దారుణంగా ట్రోల్స్..!

|

Nov 13, 2021 | 7:31 AM

Hasan Ali trolls: టోర్నమెంట్‌లో తమ విజయాల పరంపరను కొనసాగించాలని భావించిన పాకిస్తాన్ టీం ఆశలను ఆస్ట్రేలియా చిదిమేసింది. ఈ మ్యాచులో హసన్ అలీ జారవిడిచిన క్యాచ్ ఫైనల్స్ బెర్త్‌ను కోల్పోయేలా చేసిందని తెలిసిందే.

T20 World Cup 2021: గేమ్ ఛేంజింగ్ క్యాచ్‌‌కు పాక్ ఆటగాడు బలి.. నెట్టింట్లో దారుణంగా ట్రోల్స్..!
Hasan Ali Trolls
Follow us on

Pakistan vs Australia: క్యాచ్‌లు మ్యాచులను గెలిపిస్తాయనేది క్రికెట్‌లో నానుడి. అయితే గురువారం (నవంబర్ 11)న జరిగిన రెండో సెమీఫైనల్లో ఇది నిమజేనని మరోసారి రుజువయింది. ఆస్ట్రేలియన్లు మాథ్యూ వేడ్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనలు ఉత్కంఠభరితమైన సెమీఫైనల్ పోరులో ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించి 2021 ఐసీసీ పురుషుల ఫైనల్‌కు చేరుకున్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో పాకిస్తాన్ ఇంటి బాట పట్టింది.

అయితే, టీ20 ప్రపంచకప్‌లో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచులోనే కాదు.. టోర్నమెంట్‌లో తమ విజయాల పరంపరను కొనసాగించాలనే ఆశతో పాకిస్తాన్ ఫేవరెట్‌గా కనిపించింది. అయితే హసన్ అలీ జారవిడిచిన క్యాచ్ వారికి ఫైనల్స్ బెర్త్‌ను కోల్పోయేలా చేసింది. దీంతో పాకిస్తాన్ ఆటగాడు హసన్ అలీ నెట్టింట్లో విపరీతంగా ట్రోల్ అవుతున్నాడు.

ఆస్ట్రేలియాకు చివరి 2 ఓవర్లలో 22 పరుగులు అవసరం అయ్యాయి. 19వ ఓవర్లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం తన బెస్ట్ బౌలర్ షాహీన్ ఆఫ్రిదిని తీసుకొచ్చాడు. ఆరంభం బాగానే ఉంది. కానీ, వేడ్ భారీ బౌండరీ కొట్టాలని ప్రయత్నించిన ఓ బంతి మిస్ ఫైర్ అయింది. ఈ బంతి గాల్లోకి లేచి క్యాచ్‌గా వెళ్లింది. అయితే ఈ క్యాచ్‌ను హసన్ అలీ జారవిడిచాడు. దీంతో లైఫ్ అందుకున్న వేడ్.. తరువాతి మూడు బంతులను మూడు సిక్సులుగా మలచి ఆస్ట్రేలియాకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ మ్యాచులో వేడ్ 17 బంతుల్లో 41 పరుగులు చేసి పాకిస్తాన్ పాలిట విలన్‌గా మారాడు.

ఇక మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ బాబర్ కూడా హసన్ అలీ వల్లే మ్యాచ ఓడిపోయామంటూ చెప్పడంతో, సోషల్ మీడియాలో విసరీతంగా ట్రోల్స్ మొదలయ్యాయి. హసన్ అలీ సున్నీ ముస్లిం అని, అందువల్లే పాకిస్తాన్ ఓడిపోయిందని ట్రోల్స్ చేస్తున్నారు. అలాగే పాకిస్తాన్‌లోకి అడుగు పెట్టగానే హసన్ అలీని కాల్చి పారేయాలంటే పేర్కొంటున్నారు. అయితే షాహీన్ అఫ్రిదీ ఈ ఓవర్‌లో వరుస బంతుల్లో మూడు సిక్సర్లు అందించినా.. పాపం హసన్ అలీనే విలన్‌గా మారిపోయాడు.

Also Read: T20 World Cup 2021: నేనూ అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాను.. పాక్ క్రికెట్ జట్టుకు మద్దతుగా ఆ దేశ ప్రధాని ట్వీట్..

T20 World Cup 2021: అతనికి యార్కర్ బౌలింగ్ చేసే జ్ఞానం లేదు.. కాబోయే అల్లుడే ఓటమికి కారణం..