ODI World Cup 2023: భారత్‌లో వన్డే ప్రపంచకప్.. దేశం దాటిన పాకిస్తాన్ మ్యాచ్‌లు.. ఎక్కడంటే?

|

Mar 29, 2023 | 8:04 PM

ICC WC 2023: వన్డే ప్రపంచ కప్ 2023 ఈ ఏడాది భారతదేశంలో జరగనుంది. అదే స‌మ‌యంలో ఈ టోర్నీకి ముందు కొన్ని కీలక వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌కు సంబంధించిన అన్ని మ్యాచ్‌లను..

ODI World Cup 2023: భారత్‌లో వన్డే ప్రపంచకప్.. దేశం దాటిన పాకిస్తాన్ మ్యాచ్‌లు.. ఎక్కడంటే?
Ind Vs Pak
Follow us on

ICC ODI World Cup 2023, Pakitan Team: వన్డే ప్రపంచ కప్ 2023 ఈ ఏడాది భారతదేశంలో జరగనుంది. అదే స‌మ‌యంలో ఈ టోర్నీకి ముందు కొన్ని కీలక వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌కు సంబంధించిన అన్ని మ్యాచ్‌లను బంగ్లాదేశ్‌లో నిర్వహించవచ్చని తెలుస్తోంది. ఐసీసీ ప్రస్తుతం హైబ్రిడ్ ప్రపంచ కప్ ప్రణాళికపై చర్చిస్తోంది.

పాకిస్థాన్ జట్టు తన ప్రపంచకప్ 2023 మ్యాచ్‌ను భారత్‌లో కాకుండా బంగ్లాదేశ్‌లో ఆడవచ్చని ఐసీసీ సమావేశంలో చర్చించారంట. అయితే దీనిపై అందరి అభిప్రాయాలు కూడా తీసుకోనుందని వార్తలు వినిపిస్తున్నాయి. భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో పాక్ క్రికెటర్లకు వీసాలు ఇస్తామని భారత ప్రభుత్వం ఐసీసీకి తెలిపినా.. పాక్ మ్యాచ్‌లు బంగ్లాలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారంట.

భారత్‌లో 2023 ప్రపంచకప్ ఆడకుండా భారత్‌కు గట్టిగా సమాధానం చెప్పాలని పాకిస్తాన్ కోరుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం.. ఈ ఏడాది ఆసియా కప్ 2023 ఈవెంట్‌ను పాకిస్థాన్‌లో నిర్వహించాల్సి ఉంది. 2023 ఆసియా కప్ కోసం టీమిండియా పాకిస్థాన్‌లో పర్యటించబోదని భారత్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈమేరకు పాకిస్తాన్ కూడా 2023 వన్డే ప్రపంచకప్ ఆడబోమంటూ బెదిరిస్తోంది. ఈ క్రమంలో ఐసీసీ రంగంలోకి దిగినట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి.

ఇవి కూడా చదవండి

భారతదేశ ప్రకటన తర్వాత, గత 5 నెలలుగా కొనసాగుతున్న ఆసియా కప్ 2023 వివాదం దాదాపుగా పరిష్కారమయ్యే దశలో ఉందని ESPN నివేదికలో వెల్లడైంది. ఇటీవల, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సమావేశంలో, పాకిస్తాన్ ఆసియా కప్‌నకు ఆతిథ్యం ఇవ్వడం దాదాపుగా మారినట్లేనని తెలుస్తోంది. ఈ సందర్భంగా భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లదని స్పష్టమవుతోంది. ఆసియా కప్ వేరే దేశంలో నిర్వహించనున్నట్లు ఏసీసీ తేల్చింది. ఒకవేళ పాక్‌లోనే నిర్వహిస్తే.. భారత్ మ్యాచ్‌లను మాత్రం వేరే దేశంలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఐసీసీ సమావేశంలో పాకిస్తాన్ కూడా ప్రపంచ కప్‌లో తన మ్యాచ్‌లు ఆడటానికి ఇదే ప్రణాళికను రూపొందించాలని కోరినట్లు తెలుస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..