Video: 38 ఏళ్ల వయసులో తొలి హ్యాట్రిక్.. సరికొత్త చరిత్ర సృష్టించిన పాక్ బౌలర్..

Noman Ali Hat Trick: ముల్తాన్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నోమన్ అలీ టెస్టు క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. దీంతో తొలి పాక్‌ స్పిన్నర్‌గా రికార్డుల్లోకి ఎక్కిన నోమన్ అలీ, మొత్తంగా పాకిస్తాన్ తరపున 5వ బౌలర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం ఆరు వికెట్లు పడగొట్టిన నోమన్ అలీ వెస్టిండీస్ జట్టుపై ఆధిపత్యం చెలాయించాడు.

Video: 38 ఏళ్ల వయసులో తొలి హ్యాట్రిక్.. సరికొత్త చరిత్ర సృష్టించిన పాక్ బౌలర్..
Noman Ali Hat Trick

Updated on: Jan 25, 2025 | 3:47 PM

Noman Ali Hat Trick: పాకిస్థాన్‌కు చెందిన పవర్‌ఫుల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నోమన్ అలీ టెస్టు క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. ముల్తాన్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో తొలిరోజే హ్యాట్రిక్ సాధించి సంచలనం సృష్టించాడు. నోమన్ అలీ టెస్టు క్రికెట్‌లో హ్యాట్రిక్‌ సాధించిన తొలి పాక్‌ స్పిన్నర్‌గా నిలిచాడు. 38 ఏళ్ల నోమన్ అలీ ముల్తాన్ టెస్టు తొలి రోజునే వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్‌ను నాశనం చేశాడు. నోమన్ అలీ తన తొలి హ్యాట్రిక్ సహా 6 వికెట్లు పడగొట్టాడు. మొత్తం 15.1 ఓవర్లు వేసిన నోమన్ అలీ 6 వికెట్లు పడగొట్టాడు.

చరిత్ర సృష్టించిన నోమన్ అలీ..

టెస్టు క్రికెట్‌లో హ్యాట్రిక్ సాధించిన తొలి పాకిస్థాన్ బౌలర్ వసీం అక్రమ్ అనే సంగతి తెలిసిందే. నోమన్ అలీ టెస్ట్ క్రికెట్‌లో హ్యాట్రిక్ పూర్తి చేసిన ఐదవ బౌలర్, పాకిస్తాన్ తొలి స్పిన్నర్‌గా మారాడు. నోమన్ అలీ ఇప్పుడు ఈ ప్రత్యేక జాబితాలో చేరాడు. నోమన్ అలీ కంటే ముందు, నసీమ్ షా 2020 సంవత్సరంలో రావల్పిండిలో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించాడు. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో, 12వ ఓవర్‌లో, నోమన్ అలీ మొదటి మూడు వరుస బంతుల్లో జస్టిన్ గ్రీవ్స్ (1), టెవిన్ ఇమ్లాచ్ (0), కెవిన్ సింక్లెయిర్ (0)లను అవుట్ చేసి టెస్ట్‌లో హ్యాట్రిక్ సాధించిన ఘనత సాధించాడు.

టెస్టు క్రికెట్‌లో పాకిస్థాన్ తరపున హ్యాట్రిక్ సాధించిన బౌలర్లు..

1. వసీం అక్రమ్ – vs శ్రీలంక – (1999 లాహోర్ టెస్ట్)

2. వసీం అక్రమ్ – vs శ్రీలంక – (1999 ఢాకా టెస్ట్)

3. అబ్దుల్ రజాక్ – vs శ్రీలంక – (2000 గాలె టెస్ట్)

4. మహమ్మద్ సమీ – vs శ్రీలంక – (2002 లాహోర్ టెస్ట్)

5. నసీమ్ షా – vs బంగ్లాదేశ్ – (2020 రావల్పిండి టెస్ట్)

6. నోమన్ అలీ – vs వెస్టిండీస్ – (2025 ముల్తాన్ టెస్ట్)

వసీం అక్రమ్ పాకిస్తాన్ తొలి హ్యాట్రిక్ మ్యాన్..

పాకిస్థాన్ తరపున టెస్టుల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి ఆటగాడు వసీం అక్రమ్. వసీం అక్రమ్ 1999లో శ్రీలంకపై మొదట లాహోర్‌లో ఆపై ఢాకాలో రెండుసార్లు ఈ ఫీట్ సాధించాడు. ఆ తర్వాత, జూన్ 2000లో గాలేలో శ్రీలంకపై అబ్దుల్ రజాక్ హ్యాట్రిక్ సాధించాడు. 2002లో లాహోర్‌లో జరిగిన ఆసియా టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో మహ్మద్ సమీ పాకిస్థాన్ తరపున హ్యాట్రిక్ సాధించాడు. నోమన్ అలీ కంటే ముందు, టెస్టు హ్యాట్రిక్ సాధించిన చివరి పాకిస్థానీ నసీమ్ షా, ఫిబ్రవరి 2020లో రావల్పిండి క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్‌పై ఈ ఘనత సాధించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..