Pakistan : టీ20 వరల్డ్ కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ డౌటేనా? పీసీబీ దగ్గర ఉన్న ప్లాన్ బి ఏంటి?

Pakistan : టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి ముందే దౌత్యపరమైన ఉత్కంఠ పరాకాష్టకు చేరింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో సోమవారం భేటీ అయిన తర్వాత కూడా టోర్నీలో పాల్గొనడంపై సస్పెన్స్ వీడలేదు.

Pakistan : టీ20 వరల్డ్ కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ డౌటేనా? పీసీబీ దగ్గర ఉన్న ప్లాన్ బి ఏంటి?
Pakistan

Updated on: Jan 27, 2026 | 8:22 AM

Pakistan : టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి ముందే దౌత్యపరమైన ఉత్కంఠ పరాకాష్టకు చేరింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో సోమవారం భేటీ అయిన తర్వాత కూడా టోర్నీలో పాల్గొనడంపై సస్పెన్స్ వీడలేదు. బంగ్లాదేశ్‌ను ఐసీసీ తప్పించడంపై గుర్రుగా ఉన్న పాకిస్థాన్, తమ తుది నిర్ణయాన్ని ఈ శుక్రవారం (జనవరి 30) లేదా వచ్చే సోమవారం (ఫిబ్రవరి 2) వెల్లడిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు ప్లాన్ ఏ, బి, సి, డిలపై చర్చ సాగుతోంది.

ప్రధానితో భేటీ.. నిర్ణయం వాయిదా

సోమవారం లాహోర్‌లో ప్రధాని షెహబాజ్ షరీఫ్, పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మధ్య జరిగిన సమావేశం అత్యంత కీలకంగా మారింది. ఐసీసీ వ్యవహారంపై ప్రధానికి నఖ్వీ పూర్తి వివరాలు అందించారు. అన్ని ఆప్షన్లను సిద్ధంగా ఉంచుకోవాలని, దేశ ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం తీసుకోవాలని ప్రధాని ఆదేశించారు. దీంతో, పాకిస్థాన్ తన 15 మంది సభ్యుల జట్టును ప్రకటించినప్పటికీ, అది ప్రభుత్వం ఇచ్చే అనుమతిపైనే ఆధారపడి ఉంటుందని నఖ్వీ స్పష్టం చేశారు.

ఇండియా మ్యాచ్ బహిష్కరణ?

పాకిస్థాన్ ఆలోచన కేవలం టోర్నీ నుంచి తప్పుకోవడం మాత్రమే కాదు, ఒకవేళ టోర్నీ ఆడినా ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్‌ను బహిష్కరించాలనే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తోంది. బంగ్లాదేశ్‌కు మద్దతుగా ఈ నిరసన తెలపాలని పాక్ భావిస్తోంది. అయితే, ఐసీసీకి అత్యంత ఆదాయం తెచ్చిపెట్టే ఈ మ్యాచ్‌ను బహిష్కరిస్తే ఐసీసీ నుంచి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఐసీసీ నుంచి కఠిన శిక్షలు: ఒకవేళ పాకిస్థాన్ వరల్డ్ కప్‌ను బాయ్‌కాట్ చేస్తే, ఐసీసీ ఎన్నడూ లేని విధంగా ఆంక్షలు విధించే అవకాశం ఉంది.

పీఎస్ఎల్‎కు ముప్పు: పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో విదేశీ ఆటగాళ్లు ఆడేందుకు ఎన్ఓసీలు ఇవ్వకుండా ఇతర దేశాల బోర్డులను ఐసీసీ కోరవచ్చు.

ఆర్థిక దెబ్బ: ఐసీసీ నుంచి పాకిస్థాన్‌కు అందే కోట్లాది రూపాయల నిధులు నిలిచిపోతాయి.

ట్రోఫీలు, సిరీస్‌ల నుంచి తొలగింపు: ఆసియా కప్ నుంచి బహిష్కరించడంతో పాటు ఇతర దేశాలతో ద్వైపాక్షిక సిరీస్‌లు రద్దు కావచ్చు.

ఆసియా కప్ రద్దు: ఆసియా కప్ నిర్వహణ హక్కులను కూడా పాక్ కోల్పోయే ప్రమాదం ఉంది.

పాకిస్థాన్ ఒకవైపు జట్టును ప్రకటించి, మరోవైపు ప్రభుత్వం అనుమతి అని చెబుతుండటం కేవలం ఐసీసీపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంగా కనిపిస్తోంది. అయితే, ఐసీసీ ఆంక్షల హెచ్చరిక నేపథ్యంలో పాక్ చివరకు టోర్నీలో పాల్గొనే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..