అఫ్రిది నన్ను మతం మార్చుకోమన్నాడు.. మరో పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
‘‘షోయబ్ అక్తర్, షాహిద్ అఫ్రిది వంటి అనేక మంది పాకిస్తానీ ఆటగాళ్ళు నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టేవారని డానిష్ కనేరియా ఆరోపించారు. వారు నాతో కలిసి భోజనం కూడా చేయలేదన్నారు. అదే సమయంలో, నా మతం మార్చుకోవాలని పదే పదే అడిగిన ప్రధాన వ్యక్తి షాహిద్ అఫ్రిది. కానీ ఇంజమామ్-ఉల్-హక్ ఎప్పుడూ నాతో ఇలా మాట్లాడలేదన్నారు’’

పాకిస్తాన్‌లోని మైనారిటీల పరిస్థితిపై అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో గురువారం (మార్చి 13) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో పాకిస్తాన్‌లో తాను ఎదుర్కొన్న వివక్ష గురించి, అక్కడ ఇతరులు తనతో ఎలా ప్రవర్తించారో సంచలన విషయాలు బయటపెట్టారు. పాకిస్తాన్‌లో సమాన గౌరవం లేకపోవడం, వివక్షత కారణంగా తన కెరీర్ నాశనమైందని కనేరియా అన్నారు.
అమెరికా కాంగ్రెస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో డానిష్ కనేరియా చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అలాగే పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఈ రోజు మనమందరం ఇక్కడ సమావేశమై పాకిస్తాన్‌లో మనల్ని ఎలా చూసుకున్నారో, మన అనుభవాలను పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. మేము చాలా వివక్షను ఎదుర్కున్నామని, దానికి వ్యతిరేకంగా ఇప్పడు గొంతు విప్పేందుకు అవకాశం దొరికింది” అన్నారు.
“నేను కూడా పాకిస్తాన్‌లో చాలా వివక్షను ఎదుర్కొన్నాను. దీని కారణంగా క్రికెట్ కెరీర్ పూర్తిగా నాశనమైంది. నాకు పూర్తిగా దక్కాల్సిన గౌరవం, సమానత్వం పాకిస్తాన్‌లో లభించలేదు. పాకిస్తాన్‌లో నేను ఎదుర్కొన్న అదే వివక్ష కారణంగా, నేను ఈ రోజు అమెరికాలో ఉన్నాను. పాకిస్తాన్‌లో మేము ఎదుర్కొన్న బాధల గురించి అమెరికాకు సాధ్యమైనంతవరకు తెలియజేయడానికి, అవగాహన కలిగించడానికి, అప్పుడే ఏదొక చర్యలు తీసుకోనేందుకు ఆస్కారముంటుంది’’ అని క్రికెటర్ కనేరియా తెలిపారు.
మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా పాకిస్తాన్ తరపున మొత్తం 61 టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడటం గమనార్హం. అనిల్ దల్పత్ తర్వాత పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రెండవ హిందూ క్రికెటర్ ఆయన. పాకిస్తాన్ క్రికెట్ జట్టులో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్ డానిష్ కనేరియా 2023 సంవత్సరంలో షాహిద్ అఫ్రిది గురించి సంచలన ఆరోపణలు చేశారు. “షాహిద్ అఫ్రిది తనను మతాన్ని మార్చుకోవాలని పదే పదే ఒత్తిడి తెచ్చాడు” అని చెప్పాడు. పాకిస్తాన్ క్రికెట్ జట్టులో తనకు ఎప్పుడూ మద్దతు ఇచ్చే ఏకైక కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ అని కనేరియా అన్నారు.“నేను నా కెరీర్‌లో చాలా బాగా రాణిస్తున్నాను. కౌంటీ క్రికెట్ కూడా ఆడుతున్నాను. ఈ సమయంలో ఇంజమామ్-ఉల్-హక్ నాకు చాలా మద్దతు ఇచ్చారు. నన్ను బాగా చూసుకున్న ఏకైక కెప్టెన్ అతనే.’’ అని కనేరియా స్పష్టం చేశారు.
మరోవైపు, ‘‘షోయబ్ అక్తర్, షాహిద్ అఫ్రిది వంటి అనేక మంది పాకిస్తానీ ఆటగాళ్ళు నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టేవారని కనేరియా ఆరోపించారు. వారు నాతో కలిసి భోజనం కూడా చేయలేదన్నారు. అదే సమయంలో, నా మతం మార్చుకోవాలని పదే పదే అడిగిన ప్రధాన వ్యక్తి షాహిద్ అఫ్రిది. కానీ ఇంజమామ్-ఉల్-హక్ ఎప్పుడూ నాతో ఇలా మాట్లాడలేదన్నారు’’
వీడియో చూడండి..
#WATCH | Washington, DC | On the Congressional Briefing on 'plight of minorities in Pakistan', Danish Kaneria, the last Hindu cricketer to play for Pakistan internationally, says, "Today, we discussed how we had to go through discrimination. And we raised our voices against all… pic.twitter.com/elCcqtpbbI
— ANI (@ANI) March 12, 2025
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..