Salman Agha: ఓడినా బలుపు తగ్గలే.. రన్నరప్ చెక్‌ను విసిరేసిన పాక్ కెప్టెన్

ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్ చేతిలో ఓటమి పాలైన తర్వాత పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా తీవ్ర నిరాశకు గురయ్యాడు. మ్యాచ్ అనంతర ప్రెజెంటేషన్ వేడుకలో రన్నరప్ చెక్కును తీసుకున్న వెంటనే ఆగ్రహంతో విసిరివేశాడు. దుబాయ్‌లో జరిగిన ఈ టైటిల్ పోరులో తిలక్ వర్మ అజేయంగా 69 పరుగులు చేసి, భారత్ 147 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు, రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించడంలో కీలక పాత్ర పోషించాడు.

Salman Agha: ఓడినా బలుపు తగ్గలే.. రన్నరప్ చెక్‌ను విసిరేసిన పాక్ కెప్టెన్
Salman Agha (1)

Edited By: Venkata Chari

Updated on: Sep 29, 2025 | 6:18 PM

Salman Agha : ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్ చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలైన తర్వాత పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా తీవ్ర నిరాశకు గురయ్యాడు. దుబాయ్‌లో జరిగిన ఈ టైటిల్ మ్యాచ్‌లో తిలక్ వర్మ అద్భుతంగా ఆడి అజేయంగా 69 పరుగులు చేశాడు. దీంతో భారత్ 147 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు, రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి విజయం సాధించింది. సంజు శాంసన్ (24), శివమ్ దూబే (33)తో కలిసి తిలక్ చేసిన కీలక భాగస్వామ్యాలు పాకిస్థాన్ గెలుపు ఆశలను దూరం చేశాయి. ఈ టోర్నమెంట్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్‌కు ఇది వరుసగా మూడో ఓటమి కావడంతో ఆగా తీవ్ర నిరాశ చెందాడు.

రన్నరప్ చెక్కును విసిరేసిన ఆగా

మ్యాచ్ తర్వాత జరిగిన ప్రెజెంటేషన్ వేడుకలో, ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) ప్రతినిధి అమీనుల్ ఇస్లాం నుండి రన్నరప్ చెక్కును అందుకున్న వెంటనే సల్మాన్ ఆగా ఆగ్రహంతో దానిని విసిరేశాడు. అయితే, అతని ఈ చర్యకు అక్కడున్న ప్రేక్షకుల నుండి వ్యతిరేకత ఎదురైంది.

ఓటమిపై ఆగా స్పందన

ఓటమి తర్వాత మాట్లాడిన సల్మాన్ ఆగా ఈ ఫలితం మింగుడు పడడం లేదని అంగీకరించాడు. బ్యాటింగ్‌లో తమ జట్టు సరిగా ఆడలేదని, ముఖ్యంగా స్ట్రైక్‌ను రొటేట్ చేయడంలో.. కీలక సమయంలో వికెట్లు కోల్పోవడం వల్లే అనుకున్నంత స్కోరు చేయలేకపోయామని ఆయన వివరించారు.

అయితే, బౌలింగ్‌లో మాత్రం తమ జట్టు అద్భుతంగా ఆడిందని ఆగా ప్రశంసించారు. బౌలర్లకు తగినన్ని పరుగులు అందించనందుకు బ్యాట్స్‌మెన్‌లను, తనతో సహా, ఆయన నిందించారు. భవిష్యత్తులో తమ బ్యాటింగ్‌ను మెరుగుపరుచుకుంటామని, బలంగా తిరిగి వస్తామని ఆగా ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..