Video: తొలి బంతికే బౌండరీ.. అఫ్రిదికి బడితపూజ చేసిన డచ్ బ్యాటర్లు.. కట్‌చేస్తే.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయలేగా..

Shaheen Shah Afridi: 2026 టీ20 ప్రపంచ కప్ లో భాగంగా పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. అయితే, తొలి మ్యాచ్ లోనే పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిదికి ఘోర పరాజయం దక్కింది. ఈ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల కూడాను కూడా పూర్తి చేయడంలో విఫలమయ్యాడు.

Video: తొలి బంతికే బౌండరీ.. అఫ్రిదికి బడితపూజ చేసిన డచ్ బ్యాటర్లు.. కట్‌చేస్తే.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయలేగా..
Shaheen Shah Afridi

Updated on: Feb 07, 2026 | 2:05 PM

పాకిస్తాన్ క్రికెట్ జట్టు గత 16 సంవత్సరాలుగా టీ20 ప్రపంచ కప్ టైటిల్ కోసం ఎదురుచూస్తోంది. 2009లో ఒకే ఒక్కసారి ట్రోఫీని గెలుచుకున్న పాకిస్తాన్ మరోసారి 2026 టీ20 ప్రపంచ కప్‌లోకి భారీ ఆశలతో అడుగుపెట్టింది. అయితే, పాకిస్తాన్ బౌలింగ్‌కు అతిపెద్ద ఆయుధమైన షాహీన్ షా అఫ్రిది.. తొలి మ్యాచ్ లోనే తీవ్రంగా నిరాశ పరిచాడు. నెదర్లాండ్స్ వంటి చిన్న జట్టు బ్యాటర్స్ ఈ పాకిస్తానీ స్టార్ పేసర్‌కు బడిత పూజ చేశారు. ముఖ్యంగా, డచ్ ఓపెనర్ మైఖేల్ లెవిట్ టోర్నమెంట్‌లో మొదటి బంతినే సిక్స్ కొట్టి షాకిచ్చాడు.

మొదటి బంతి నుంచే షాహీన్ కు ఘోర అవమానం..

కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన టీ20 ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు బంతితో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఎప్పటిలాగే, ఎడమచేతి వాటం పేసర్ షాహీన్ అఫ్రిది మొదటి లేదా రెండవ ఓవర్‌లో బ్రేక్‌త్రూ అందిస్తాడని పాకిస్తాన్ ఆశించింది. కానీ, షాహీన్ వికెట్ తీయడం గురించి కాకుండా.. ఒక్క పరుగు కూడా ఆదా చేయడంలో విఫలమయ్యాడు. అతను తన మొదటి రెండు ఓవర్లలో 20 కంటే ఎక్కువ పరుగులు సమర్పించుకున్నాడు.

ప్రపంచ కప్‌లో తొలి బంతికే నెదర్లాండ్స్ ఓపెనర్ మాక్స్ ఓడౌడ్ మైఖేల్ లెవిట్ సిక్స్ కొట్టాడు. షాహీన్ మొదటి ఓవర్‌లో మరో ఫోర్ ఇచ్చి తొమ్మిది పరుగులు సమర్పించుకున్నాడు. సల్మాన్ మీర్జా మంచి ఓవర్ వేశాడు. అయితే, షాహీన్ మూడో ఓవర్ వేసిన సమయంలోనూ అదే పరిస్థితి ఎదురైంది. లెవిట్ మరోసారి అతనిని లక్ష్యంగా చేసుకున్నాడు. డచ్ ఓపెనర్ ఆ ఓవర్‌లోని మొదటి బంతికి ఫోర్ కొట్టగా, రెండవ బంతికి రెండు పరుగులు తీశాడు.

బంతిని మార్చేసిన అంపైర్లు..

ఆ తర్వాత మూడో బంతికే షాహీన్ కు భారీ షాక్ తగిలింది. బౌన్సర్ తో లెవిట్ ని భయపెట్టడానికి ప్రయత్నించాడు. కానీ, ఘోరంగా విఫలమయ్యాడు. కుడిచేతి వాటం బ్యాటర్ లెవిట్ ఫవర్ ఫుల్ పుల్ షాట్ కొట్టాడు. బంతి స్టేడియం నుంచి బయటకు వెళ్ళింది. ఈ అద్భుతమైన సిక్స్ పాకిస్తాన్ ను ఆశ్చర్యపరిచింది. బంతి తిరిగి మైదానంలోకి వచ్చినప్పుడు, అది దాని ఆకారాన్ని కోల్పోయింది. దీంతో అంపైర్లు మూడవ ఓవర్ లోనే మార్చారు.

షాహీన్ 4 ఓవర్లు కూడా పూర్తి చేయలే..

మొత్తం మీద, ఇది షాహీన్‌కు మంచి మ్యాచ్ కాదని తేలింది. అతను తన మొదటి తొమ్మిది బంతుల్లో 21 పరుగులు ఇచ్చాడు. దీంతో తన నాలుగు ఓవర్లు పూర్తి చేయలేకపోయాడు. అతనికి మూడు ఓవర్లు మాత్రమే ఇచ్చాడు కెప్టెన్. నెదర్లాండ్స్ టెయిల్-ఎండర్లు బ్యాటింగ్ చేస్తున్న 19వ ఓవర్‌లో అతను బౌలింగ్ చేయడానికి తిరిగి వచ్చాడు. ఇక్కడ అతను ఒక వికెట్ తీసుకున్నాడు. కానీ మొత్తం మీద, అతను సాధారణ ప్రదర్శనతో మ్యాచ్‌ను ముగించాడు. అంటే, మూడు ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..