రావల్పిండి వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు చెలరేగింది. తొలిరోజు ఏకంగా నలుగురు బ్యాటర్లు సెంచరీలు సాధించారు. ఓపెనర్లు జాక్ క్రాలే 111 బంతుల్లో 122 పరుగులు, బెన్ డకెట్ 110 బంతుల్లో 107 పరుగులు చేశారు. ఆ తర్వాత వచ్చిన ఓలి పోప్ కూడా 104 బంతుల్లో 108 పరుగులు చేశాడు. కానీ మూడో స్థానంలో వచ్చిన జో రూట్ 23 పరుగులు చేసి జాహిద్ మెహమూద్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. ఈ దశలో బరిలోకి దిగిన యువ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. క్రీజులోకి రాగానే పాక్ బౌలర్లను ఉతికారేయడం మొదలుపెట్టిన బ్రూక్ సౌద్.. షకీల్ వేసిన 68వ ఓవర్‌లో విశ్వరూపం ప్రదర్శించాడు. ఏకంగా 6 బంతుల్లో 6 ఫోర్లు కొట్టి దిగ్గజాల సరసన చోటు సంపాదించాడు.
ఈ ఓవర్‌లో షకీల్ వేసిన మొదటి బంతిని ఔట్ ఆఫ్ ఆఫ్‌లో ఫోర్ కొట్టిన బ్రూక్, రెండో బంతిని ఎక్స్‌ట్రా కవర్‌గా కొట్టి బౌండరీ బాదాడు. అతను 3వ బంతిని ఆకర్షణీయమైన ఆఫ్‌సైడ్ షాట్‌తో బౌండరీకి పంపాడు. అలాగే, 4వ బంతిని ఆఫ్‌సైడ్‌కి ఫోర్‌గా తరలించగా, 5వ బంతిని ఎక్స్‌ట్రా కవర్‌కు పంపించాడు. ఇక ఓవర్ చివరి బంతిని మిడ్ వికెట్ బౌండరీగా పంపి మొత్తం 24 పరుగులు పిండుకున్నాడు బ్రూక్. కాగా ఈ మ్యాచ్‌లో కేవలం 80 బంతుల్లోనే 14 ఫోర్లు, 2 సిక్సర్లతో కెరీర్‌లో తొలి సెంచరీని పూర్తి చేశాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు 4 వికెట్లు కోల్పోయి 506 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (101), కెప్టెన్ బెన్ స్టోక్స్ (34) క్రీజులో ఉన్నారు.
Harry Brook smashed 4,4,4,4,4,4 to Saud Shakeel in a single over @aaliaaaliya pic.twitter.com/Rb6ZZtyzVO
— Muhammad Noman (@Nomancricket29) December 1, 2022
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..