IPL 2021 Auction: ఐపీఎల్ వేలం నుంచి తప్పుకోవడం కొంచెం కష్టమైన చర్యగానే భావిస్తున్నానని చెబుతున్నాడు ఇంగ్లాండ్ సారథి జోరూట్. అంతర్జాతీయ క్రికెట్లో విరామం లేకుండా షెడ్యూలు ఉండటంతో తప్పడం లేదని పేర్కొన్నాడు. వేలంలో పాల్గొనేందుకు వచ్చే ఏడాదైనా ప్రయత్నిస్తానని వెల్లడించాడు. రెండో టెస్ట్ సందర్భంగా జో రూట్ మీడియాతో మాట్లాడుతూ..
ఈ ఏడాది విపరీతంగా టెస్టు క్రికెట్ ఉంది. అందుకే లీగులో అడుగుపెట్టేందుకు ఇది సరైన సమయంగా భావించడం లేదన్నాడు. పూర్తిగా ఏకాగ్రత కనబర్చలేనని అనిపిస్తోందని తన మనసులో మాట చెప్పాడు. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ఆడతానని, కనీసం వేలంలోనైనా పాల్గొంటానని రూట్ పేర్కొన్నాడు. తొలి మ్యాచులో గెలిచినా రెండో మ్యాచులో ఎదురయ్యే సవాళ్ల గురించి తమకు తెలుసని చెప్పాడు. మాకు గట్టి సవాళ్లు ఎదురవుతాయని, ఉపఖండం పరిస్థితుల్లో గెలవాలంటే ఎంత కష్టపడాలో మేం అర్థం చేసుకోగలమని తెలిపాడు. తొలి ఇన్నింగ్స్‌లో విరాట్‌ను ఔట్ చేసేందుకు బెస్ తెలివైన బంతి విసిరాడని కొనియాడాడు. మేమిలాగే అతడికి తెలివైన బంతులు విసిరి ఒత్తిడి చేస్తామని ఈ సందర్భంగా గుర్తు చేశాడు.