క్రికెట్‌ ఆడేందుకు బూట్లు కూడా లేవు ఒకప్పుడు..! ప్రస్తుతం ఐపీఎల్‌ టాప్ బౌలర్లలో ఒకడు.. ఎవరో తెలుసా..?

|

Apr 13, 2021 | 8:05 AM

Rajasthan Royal Bowler Chetan Zakaria : ఐపీఎల్‌14లో భాగంగా నిన్న జరిగిన పంజాబ్‌ కింగ్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ యువకెరటం ఎగిసిపడింది. తనదైన పేస్‌, స్వింగ్‌తో మొదటగా బ్యాటింగ్

క్రికెట్‌ ఆడేందుకు బూట్లు కూడా లేవు ఒకప్పుడు..! ప్రస్తుతం ఐపీఎల్‌ టాప్ బౌలర్లలో ఒకడు.. ఎవరో తెలుసా..?
Chetan Zakaria
Follow us on

Rajasthan Royal Bowler Chetan Zakaria : ఐపీఎల్‌14లో భాగంగా నిన్న జరిగిన పంజాబ్‌ కింగ్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ యువకెరటం ఎగిసిపడింది. తనదైన పేస్‌, స్వింగ్‌తో మొదటగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. రెండో ఓవర్లోనే ఓపెనర్ మయాంక్‌ను ఔట్ చేశాడు. శతకం దిశగా సాగుతున్న కేఎల్‌ రాహుల్‌తో పాటు రిచర్డ్‌సన్‌ను ఔట్‌ చేయడమే కాకుండా ఫీల్డింగ్‌లోనూ ఓ అద్భుతమైన క్యాచ్‌ అందుకుని అందరి చూపులను తనవైపునకు తిప్పుకున్నాడు.. అతనెవరో కాదు 23 ఏళ్ల చేతన్‌ సకారియా.

ఐపీఎల్‌లో ఈ పేరు ఇప్పుడు కొత్తగా వినిపిస్తోంది.. అయితే ఒకప్పుడు మాత్రం క్రికెట్ ఆడటానికి అతడికి బూట్లు కూడా లేవంటే నమ్ముతారా..! అవును అక్షరాల ఇది నిజం. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు 180 కిలోమీటర్ల దూరంలోని కుగ్రామమైన వార్టెజ్‌కు చెందిన ఈ లెఫ్టార్మ్‌ పేసర్‌ పేద కుటుంబంలో పుట్టాడు. చిన్నప్పటి నుంచే క్రికెట్‌పై ఆసక్తి పెంచుకుని టెన్నిస్‌ బంతితో ఆడేవాడు. మొదట్లో బ్యాట్స్‌మన్‌గా ఆడిన అతను.. ఆ తర్వాత తన పాఠశాలలో అందరి దృష్టిని ఆకర్షించడం కోసం ఫాస్ట్‌బౌలర్‌గా మారాడు. 16 ఏళ్ల వరకూ ఎలాంటి శిక్షణ లేకుండానే సొంత నైపుణ్యాలతో ఎదిగాడు. ఆ తర్వాత సౌరాష్ట్ర తరపున జూనియర్‌ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ వేలంలో రూ.1.2 కోట్ల ధరతో రాజస్థాన్‌తో చేరిన అతను ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే సత్తాచాటాడు.

అత్యంత దీన స్థితి నుంచి ఐపీఎల్‌ వరకు ఎదిగిన ఇతడి ప్రస్తానం చూస్తే చాలా ముచ్చటేస్తుంది. 17 ఏళ్ల వయసులో గాయంతో ఏడాది పాటు ఆటకు దూరమైన అతను.. కుటుంబ పోషణ భారం కావడంతో తన మేనమామ వ్యాపారం చూసుకుంటూ సాధన కొనసాగించాడు. ఆ తర్వాత ఎమ్‌ఆర్‌ఎఫ్‌ పేస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆసీస్‌ దిగ్గజ పేసర్‌ మెక్‌గ్రాత్‌ దగ్గర శిక్షణ పొందే అవకాశం దక్కింది. అక్కడి నుంచి అతను వెనుదిరిగి చూసుకోలేదు. అయితే ఆ ఫౌండేషన్‌కు వెళ్లేముందు అతనికి బూట్లు కూడా లేవు. అప్పుడు నెట్స్‌లో అతని బౌలింగ్‌కు ఫిదా అయిన సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ షెల్డన్‌ జాక్సన్‌ చేతన్‌కు జత బూట్లు ఇచ్చి ఆదుకున్నాడు. కానీ ఈ బౌలర్ ఇప్పుడు రాజస్తాన్‌కి చాలా ముఖ్యమైన ఆటగాడు.

Petrol and Diesel Price Today: స్థిరంగానే ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

Telangana Government: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. జూన్ 2వ తేదీ నుంచే కొత్తగా..!

బ్యాంకుల బాదుడు… సర్వీసు చార్జీల పేరుతో భారీగా వడ్డీంపు … ఐదేళ్లలో రూ.300 కోట్లు వసూలు చేసిన ఎస్‌బీఐ