Team India: గణతంత్రం రోజున కివీస్‌ను గడగడలాడించిన భారత్.. హిట్‌మ్యాన్‌ స్పీడ్‌కు తోడైన ధనాధన్ ధోనీ..!

|

Jan 26, 2022 | 9:45 AM

India vs New Zealand: భారత క్రికెట్ జట్టు 2019లో రిపబ్లిక్ డే రోజున న్యూజిలాండ్‌ను 90 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనితోపాటు రోహిత్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఆకట్టుకున్నారు.

Team India: గణతంత్రం రోజున కివీస్‌ను గడగడలాడించిన భారత్.. హిట్‌మ్యాన్‌ స్పీడ్‌కు తోడైన ధనాధన్ ధోనీ..!
Republic Day 2019 January 26th India Vs New Zealand
Follow us on

On This Day In Cricket: విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత క్రికెట్ జట్టు(Team India)  చాలా మ్యాచ్‌లు గెలిచింది. కానీ, వీటిలో ఒకటి చాలా ప్రత్యేకమైన విజయంగా మారింది. ఇది జనవరి 26న జరిగిన ఓ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. 2019లో విరాట్‌ సారథ్యంలో భారత్‌ 90 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌(India vs New Zealand)ను ఓడించింది. వన్డే సిరీస్‌లో ఇది రెండో మ్యాచ్. ఇందులో రోహిత్ శర్మ(Rohit Sharma), శిఖర్ ధావన్ అర్ధ సెంచరీలతో రాణించారు. మరోవైపు చివర్లో మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) ధీటుగా బ్యాటింగ్ చేసి ఆకట్టుకున్నాడు. అది 2019వ సంవత్సరం. జనవరి 26న ఆడిన మ్యాచులో భారత అభిమానులకు ఎంతో థ్రిల్‌ను అందించింది. వన్డే సిరీస్‌లో భాగంగా జరుగుతున్న రెండో మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. రోహిత్, ధావన్‌లు టీమిండియాకు ఓపెనింగ్ చేశారు. రోహిత్ 96 బంతుల్లో 87 పరుగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ధావన్ 67 బంతులు ఎదుర్కొని 9 ఫోర్ల సాయంతో 66 పరుగులు చేశాడు.

రోహిత్, శిఖర్ ఔటైన తర్వాత కెప్టెన్ కోహ్లీ, అంబటి రాయుడు మధ్య కొన్ని పరుగుల భాగస్వామ్యం నెలకొంది. ఈ సమయంలో కోహ్లీ 45 బంతుల్లో 43 పరుగులు సాధించాడు. మరోవైపు రాయుడు 49 బంతుల్లో 47 పరుగులు పూర్తి చేశాడు. చివర్లో మహేంద్ర సింగ్ ధోనీ, కేదార్ జాదవన్‌లు చెలరేగడంతో భారీ స్కోర్ సాధించింది. ధోనీ 33 బంతుల్లో అజేయంగా 48 పరుగులు చేశాడు. అలాగే కేదార్ కేవలం 10 బంతుల్లో 22 పరుగులు చేసి అత్యధిక స్కోర్ చేసేందుకు తమవంతు సహాయపడ్డారు.

భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 324 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా న్యూజిలాండ్ జట్టు 234 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ తరఫున డగ్ బ్రేక్‌వెల్ అత్యధికంగా 57 పరుగులు చేశాడు. భారత్‌ తరఫున కుల్‌దీప్‌ యాదవ్‌ 4 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్‌తో పాటు యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్ కూడా రెండేసి వికెట్లు తీశారు. ఈ విధంగా జనవరి 26న భారత జట్టు 90 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Also Read: Team India: అడిలైడ్‌లో అదరగొట్టిన భారత్.. విరాట్ విశ్వరూపం, ధోనీ మార్క్‌ ఫినిషింగ్‌తో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం

IND vs WI: టీమిండియా ప్లేయింగ్‌XIలో కీలక మార్పులు.. సౌతాఫ్రికా దెబ్బకు వారంతా విశ్రాంతిలోనే?