రెండేళ్లుగా సెంచరీ జోలికి పోని టీమిండియా కెప్టెన్..! మరీ సెంచరీ చేయకుండా 189 వన్డేలు ఆడిన లెజెండ్ క్రికెటర్ గురించి తెలుసా?

|

Jul 16, 2021 | 2:57 PM

Virat Kohli: అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. సెంచరీ రుచి చూడక రెండేళ్లవుతోంది. కోహ్లీ చివరిసారిగా 2019 నవంబర్‌లో శతకాన్ని నమోదు చేశాడు.

రెండేళ్లుగా సెంచరీ జోలికి పోని టీమిండియా కెప్టెన్..! మరీ సెంచరీ చేయకుండా 189 వన్డేలు ఆడిన లెజెండ్ క్రికెటర్ గురించి తెలుసా?
Virat Kohli Pollock
Follow us on

On This Day In Cricket: ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది. ఆగస్టు 4 న నాటింగ్‌హామ్‌లో జరిగే తొలి మ్యాచ్‌తో ఈ సిరీస్ ప్రారంభమవుతుంది. అయితే, ఈ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ కూడా ఆందోళన కలిగించేలా చేస్తోంది. విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో దాదాపు రెండేళ్లుగా ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు. అయితే, ఇప్పుడు మేం చెప్పబోయే క్రికెటర్ తన మొదటి వన్డే సెంచరీ సాధించేందుకు దాదాపు 189 మ్యాచ్‌లు ఆడాడు. ఆయనెవరో కాదు దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ షాన్ పొలాక్. నేడు ఈ ఆటగాడి పుట్టిన రోజు. జులై 16, 1973 న జన్మించిన దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్.. కేప్‌టౌన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఇందులో 66 పరుగులు చేయడంతో పాటు, 34 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టి ఘనంగా తన ఆరంభాన్ని చాటాడు. దక్షిణాఫ్రికా తరఫున 400 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా షాన్ పొలాక్ రికార్డులు నెలకొల్పాడు. ఈ దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ బ్యాట్‌తోపాటు బాల్‌తోనూ ఎన్నో మరపురాని ప్రదర్శనలు అందించాడు. కానీ కెప్టెన్‌గా మాత్రం చేదు జ్ఞాపకాలను మిగిల్చుకున్నాడు. ప్రపంచ కప్‌లో సొంతగడ్డపై అతని కెప్టెన్సీలో ఆడిన దక్షిణాఫ్రికా టీం.. లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. 2007 లో తన నాలుగవ ప్రపంచ కప్ ఆడిన షాన్ పొల్లాక్.. 2008లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.

షాన్ పొలాక్ 108 టెస్టులు, 303 వన్డేలు ఆడాడు
షాన్ పొలాక్ తన కెరీర్లో ఎన్నొ మంచి రికార్డులను నెలకొల్పాడు. అత్యధిక టెస్ట్ సెంచరీలు సాధించి లిస్టులో 9వ స్థానంలో నిలిచాడు. అలాగే తొలి సెంచరీ కోసం 189 వన్డే ఇన్నింగ్స్ ఆడి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. టెస్ట్ క్రికెట్‌లో 99 పరుగులతో అజేయంగా నిలిచిన తొలి కెప్టెన్‌గా షాన్ పొలాక్ నిలిచాడు. పొల్లాక్ దక్షిణాఫ్రికా తరపున 108 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 32.31 సగటుతో 2 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలతో 3781 పరుగులు చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో 421 వికెట్లను కూడా పడగొట్టాడు. 303 వన్డేల్లో షాన్ పొలాక్ బ్యాట్ నుంచి 26.45 సగటుతో 3519 పరుగులు రాలాయి. కేవలం ఒకటే సెంచరీతోపాటు 14 అర్ధ సెంచరీలు సాధించాడు. అలాగే వన్డే క్రికెట్‌లో 393 వికెట్లను పడగొట్టాడు. టీ 20 ఫార్మాట్‌లో షాన్ పొలాక్ 12 మ్యాచ్‌ల్లో 86 పరుగులు చేసి, 15 వికెట్లు పడగొట్టాడు.

Also Read:

Matt Parkinson: స్పిన్‌తో స్వింగ్‌ చేశాడు..!! బిత్తర పోయిన బ్యాట్స్‌మెన్‌ ఇమామ్‌..!! వీడియో

ప్రపంచ క్రికెట్‌లో అత్యంత చెత్త బౌలర్ ఇతడే..! 97 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక వికెట్ సాధించాడు..

IND vs SL: ఫేస్‌బుక్‌లో భారత్, శ్రీలంక సిరీస్.. ఎలా చూడాలో తెలుసా?