On This Day in Cricket: మూడు గంటలపాటు క్రీజులో.. కేవలం 37 పరుగులు! విమర్శలు మాత్రం లేవు.. ఓన్లీ పొగడ్తలే.. ఎందుకో తెలుసా?

|

Jul 06, 2021 | 3:55 PM

స్లోగా బ్యాటింగ్ చేసిన ఆటగాళ్లకు అభిమానులతోపాటు విమర్శకులు కూడా నానా చివాట్లు పెడుతుంటారు. కానీ, ఈ మ్యాచ్ లో మాత్రం ఓ ప్లేయర్ ని పొగడ్తలతో ముంచెత్తడం విశేషం.

On This Day in Cricket: మూడు గంటలపాటు క్రీజులో.. కేవలం 37 పరుగులు! విమర్శలు మాత్రం లేవు.. ఓన్లీ పొగడ్తలే.. ఎందుకో తెలుసా?
England Batsmen Robert Croft
Follow us on

On This Day in Cricket: ఏం బంటీ నీ సబ్బు స్లోనా ఏంటీ.. అంటూ మనం టీవీలో ఓ ప్రకటన చూసే ఉంటాం.. అయితే, క్రికెట్ విషయానికి వస్తే.. స్లోగా బ్యాటింగ్ చేసే వారిపై అభిమానులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం కూడా మనం చూసే ఉన్నాం. అయితే, ఇలా స్లోగా బ్యాటింగ్ చేయడం వల్ల కొన్నిసార్లు టీంకు చాలా ఉపయోగం కూడా కలుగుతుందని తెలుసా. అలాంటి ఇన్నింగ్స్‌లు ప్రపంచ క్రికెట్ లో చాలానే ఉన్నాయి. తాజాగా ఇలా నెమ్మదిగా బ్యాటింగ్ చేయలేకే.. డబ్ల్యూటీసీలో టీమిండియా అరంగేట్ర ట్రోఫీని కోల్పోవాల్సి వచ్చింది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్ పోరులో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కివీస్ ను కేన్ విలియమ్సన్ ఎనిమిది వికెట్ల తేడాతో టీమ్ ఇండియాను ఓడించి, తొలి ట్రోఫీని చేజిక్కించుకున్నాడు. ఈ మ్యాచ్ తరువాత, భారత బ్యాట్స్‌మన్ ఛతేశ్వర పూజారా బ్యాటింగ్ పై చాలా విమర్శలు వచ్చాయి. నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంపై ప్రశ్నల వర్షం కురింసింది. ఈ మేరకు పూజారాను సోషల్ మీడియాలో చాలామంది ట్రోల్ చేశారు. అయితే, పూజారా స్లో బ్యాటింగ్.. ఆస్ట్రేలియాలోని భారత జట్టుకు ఒక వరంగా మారిందని విమర్శకులు మర్చిపోయారు. మ్యాచ్‌ను కాపాడేందుకు లేదా గెలిచేందుకు కొన్నిసార్లు పరుగుల వేగం కంటే బంతుల సంఖ్యను తగ్గించడంపై దృష్టి పెట్టాలని క్రికెట్ అవగాహన ఉన్నవారికి తెలిసిందే. అలాంటి ఓ అద్భుతమైన ఇన్నింగ్స్‌ను ఇంగ్లాండ్ క్రికెట్ టీం తరపున రాబర్ట్ క్రాఫ్ట్ ఆడాడు. అది కూడా 1998 జులై 6న అంటే ఈ రోజునే ఆడాడు.

ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా టీంల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. జూలై 2 నుంచి 6 వరకు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫలితం ఏ జట్టుకీ అనుకూలంగా లేదు. కానీ, రాబర్ట్ చాలా నెమ్మదిగా ఆడి ఇంగ్లాండ్‌ జట్టును ఓటమి నుంచి కాపాడాడు. ఇలా స్లోగా ఆడి టీంకు మానసిక విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 5 వికెట్ల నష్టానికి 552 పరుగులు చేసి తమ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లెర్ చేసింది. ఓపెనర్ గ్యారీ కిర్‌స్టన్ 210 పరుగులు చేయగా, ఆల్ రౌండర్ జాక్వెస్ కాలిస్ 132 పరుగుల అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఆయనతో పాటు డారిల్ కుల్లినన్ 75, కెప్టెన్ హాన్సీ క్రోన్జే 69 పరుగులతో అజేయంగా నిలిచాడు. డారెన్ గోఫ్ ఇంగ్లాండ్ తరఫున మూడు వికెట్లు పడగొట్టాడు.

అలన్ డోనాల్డ్ ఆరు వికెట్లతో సంచలనం..
అనంతరం ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 183 పరుగులకే చాపచుట్టేసింది. ఓపెనర్ మైక్ ఆర్థన్ 41 పరుగులు, కెప్టెన్, వికెట్ కీపర్ అలెక్ స్టీవర్ట్ 40 పరుగులు, మార్క్ రాంప్రకాష్ 30 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా తరఫున పాల్ ఆడమ్స్ నాలుగు వికెట్లు పడగొట్టగా, జాక్వెస్ కాలిస్, అలాన్ డోనాల్డ్ తలో రెండు వికెట్లు కూల్చారు. ఫాలో-ఆన్ ఆడేందుకు రెండో సారి ఇంగ్లండ్ ను బ్యాటింగ్ ఆహ్వానించింది దక్షిణాఫ్రికా జట్టు. అయితే, ఈసారి బ్యాట్స్‌మెన్‌లు మెరుగ్గా రాణించారు. కెప్టెన్ అలెక్ స్టీవర్ట్ 164 పరుగులు సాధించగా, మైక్ ఆర్థన్ 89 పరుగులు చేశాడు. వారికి తోడు రాబర్ట్ క్రాఫ్ట్, 37 పరుగులతో నాటౌట్ గా నిలిచి, ఇంగ్లండ్ ను కాపాడాడు. ఈ 37 పరుగులు చేసేందుకు రాబర్ట్ మూడు గంటలకు పైగా సమయం తీసుకున్నాడు. ఇదే ఇన్నింగ్స్ మ్యాచ్ ముగిశాక చాలా ముఖ్యమైనదిగా నిలిచింది. మ్యాచ్ ముగిసే సమయానికి, ఇంగ్లాండ్ 9 వికెట్ల నష్టానికి 369 పరుగులు చేసింది. దాంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో అలన్ డోనాల్డ్ దక్షిణాఫ్రికా తరఫున ఆరు వికెట్లు పడగొట్టాడు. అలాగే జాక్వెస్ కాలిస్ రెండు వికెట్లు పడగొట్టాడు.

Also Read:

On this day in Cricket: కొత్త బౌలర్ దెబ్బకు టీమిండియా మటాష్; 137 పరుగులకే 10 వికెట్లు.. మాయని మచ్చలా ఆసియా కప్‌ ఫైనల్

On this day in Cricket: సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేసిన హిట్‌మ్యాన్; ఇంగ్లండ్ గడ్డపై ఆ రికార్డుతో చరిత్ర సృష్టించాడు..!