
South Africa vs Sri Lanka, 4th Match: దక్షిణాఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్క్రామ్ వన్డే ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. కేవలం 49 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఇంతకుముందు 50 బంతుల్లో సెంచరీ చేసిన ఐర్లాండ్‌కు చెందిన కెవిన్ ఓబ్రియన్ పేరిట ఈ రికార్డు ఉంది.
శనివారం శ్రీలంకతో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో 49 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న మార్క్రామ్.. 12 ఏళ్ల తర్వాత ఈ రికార్డు బ్రేక్ చేశాడు. ప్రపంచకప్‌లో ఏ బ్యాట్స్‌మెన్ చేసిన వేగవంతమైన సెంచరీ ఇదే కావడం గమనార్హం. ఈ విషయంలో ఐర్లాండ్ ఆటగాడు కెవిన్ ఓబ్రెయిన్ రికార్డును బద్దలు కొట్టాడు. కెవిన్ 2011లో భారత్‌లో జరిగిన ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై 50 బంతుల్లో సెంచరీ సాధించాడు.
ఈ మ్యాచ్‌లో మార్క్రామ్ శ్రీలంక బౌలర్లపై భీకరమైన దాడి చేసి, వేగంగా పరుగులు సాధించాడు. అయితే సెంచరీ చేసి ఎక్కువసేపు నిలవలేక పెవిలియన్ చేరాడు. 54 బంతులు ఎదుర్కొన్న అతను 14 ఫోర్లు, మూడు ఫోర్లు బాదాడు.
మార్క్రామ్ సిక్స్‌తో సెంచరీ పూర్తి చేశాడు. 46వ ఓవర్ ఐదో బంతికి మధుశంకపై సిక్సర్ బాదిన అతను సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీనికి ముందు అతను ఫోర్ కొట్టాడు. తర్వాతి బంతికి ఒక్క పరుగు తీశాడు. మార్క్రామ్ వేగంగా పరుగులు చేసేందుకు ప్రయత్నించే క్రమంలో ఔటయ్యాడు. డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సన్ మిగిలిన పని పూర్తి చేసి దక్షిణాఫ్రికాను 400లు దాటించారు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మరో రికార్డును బద్దలు కొట్టింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 50 ఓవర్లు ఆడి ఐదు వికెట్లు కోల్పోయి 428 పరుగులు చేసింది. దీంతో వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. అంతకుముందు 2015 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై ఆస్ట్రేలియా 417 పరుగులు చేసింది.
అలాగే దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా మార్క్రామ్ నిలిచాడు. అతని కంటే ముందు ఓపెనర్లు క్వింటన్ డి కాక్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్ సెంచరీలు సాధించారు. ప్రపంచకప్‌లో ఒక ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాట్స్‌మెన్స్ సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. డి కాక్ 84 బంతుల్లో 12 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 100 పరుగులు చేశాడు. దుస్సేన్ 110 బంతుల్లో 13 ఫోర్లు, రెండు సిక్సర్లతో 106 పరుగులు చేశాడు.
దక్షిణాఫ్రికా తరపున వేగవంతమైన వన్డే సెంచరీలు చేసిన ప్లేయర్లు..
31 – అబ్ డివిలియర్స్ vs WI, జో’బర్గ్, 2015
44 – మార్క్ బౌచర్ vs ZIM, పోట్చెఫ్‌స్ట్రూమ్, 2006
49 – ఐడెన్ మార్క్రామ్ vs SL, ఢిల్లీ, 2023*
52 – అబ్ డివిలియర్స్ vs WI, సిడ్నీ, 2015
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..