ODI Records: క్రికెట్(Cricket) అనేది ఎన్నో రికార్డులకు కేంద్ర బిందువుగా మారుతుంది. ఎన్నో రూపాలు మార్చుకున్నా.. ఈ రికార్డుల పర్వం మాత్రం ఆగడం లేదు. అయితే కొందరు మాత్రం కొన్ని ప్రత్యేక రికార్డులతో చరిత్రలో నిలిచిపోతుంటారు. అలాంటి వాటిలో ఈ ప్లేయర్ల కెరీర్‌లో ఇంతవరకు ఓ సెంచరీ లేకుండానే పరుగులు సాధించారు. ఈ లిస్టులో ఎవరున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. పాకిస్థాన్ మాజీ బ్యాట్స్‌మెన్ మిస్బా-ఉల్-హక్(Misbah ul haq) వన్డేల్లో సెంచరీ చేయకుండానే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ దిగ్గజ బ్యాట్స్‌మెన్ తన కెరీర్‌లో 5 వేలకు పైగా పరుగులు సాధించాడు. కానీ, మిస్బా కెరీర్‌లో సెంచరీ చేయకుండానే తన ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అలాంటి టాప్-10 బ్యాట్స్‌మెన్ జాబితాలో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) కూడా చేరాడు.
టాప్-3లో ముగ్గురు పాకిస్తానీ ఆటగాళ్లు..
ఈ లిస్టులో ముగ్గురు పాకిస్తానీ క్రికెటర్లు ఉన్నారు. అందులో మిస్బా, వసీం అక్రం, మొయిన్ ఖాన్ ఉన్నారు. మిస్బా కెరీర్‌లో 162 వన్డేల్లో 5122 పరుగులు చేశాడు. కానీ, ఎప్పుడూ సెంచరీ రుచి చూడలేదు. మిస్బా అత్యధిక స్కోరు 96 నాటౌట్‌గా నిలిచింది. సెంచరీ చేయకుండానే అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మిస్బా తర్వాత మరో ఇద్దరు పాకిస్థానీ ఆటగాళ్లలో మాజీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ (3717 పరుగులు), వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ మొయిన్ ఖాన్ (3266 పరుగులు) ఉన్నారు.
టాప్-10లో భారత్ నుంచి ఒక్కడే..
టాప్-10 జాబితాలో జింబాబ్వే ఆల్‌రౌండర్ హీత్ స్ట్రిక్, న్యూజిలాండ్‌కు చెందిన ఆండ్రూ జోన్స్ వంటి దిగ్గజాలు కూడా ఉన్నారు. వీటన్నింటిలో రవీంద్ర జడేజా ఈ జాబితాలో 9వ స్థానంలో నిలిచాడు. రవీంద్ర జడేజా 168 వన్డేల్లో 2411 పరుగులు చేశాడు. కానీ, ఇప్పటి వరకు అతని ఖాతాలో సెంచరీ రాలేదు. టీమిండియాకు చెందిన ఈ ఆల్ రౌండర్ వన్డే క్రికెట్‌లో 32.58 సగటుతో పరుగులు సాధించాడు. వన్డేల్లో జడేజా అత్యధిక స్కోరు 87 పరుగులు.
Also Read: IPL 2022: బీబీఎల్ స్టార్‌లకు బంఫర్ ఆఫర్.. మెగా వేలంలో డబ్బులే డబ్బులు.. టాప్5లో ఎవరున్నారంటే?