Asia Cup 2023: ప్రతిష్ఠత్మక ఆసియా కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్ తమ జట్టును ఆదివారం ప్రకటించింది. మొత్తం 17 మంది సభ్యులతో కూడిన ఆఫ్గాన్ జట్టును హష్మతుల్లా షాహిదీ నడిపించనున్నాడు. అయితే ఈ 17 మంది లిస్టులో అఫ్గాన్ యువ పేసర్ నవీన్ ఉల్ హక్‌కు చోటు దక్కలేదు. ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీతో నవీన్ ఉల్ హక్ గొడవ పడి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచి కూడా అటు టీమిండియా అభిమానులు, ఇటు కింగ్ కోహ్లీ అభిమానులు భారత్, అఫ్గాన్ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఆసియా కప్‌కి ముందే ఆఫ్గాన్‌తో భారత్ ఓ సిరీస్ ఆడాల్సి ఉన్నా అది రద్దయింది. దీంతో అందరూ ఆసియా కప్ మీద ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆసియా కప్ టోర్నీలో ఆడే ఆఫ్గాన్ జట్టులో నవీన్ ఉల్ హక్ లేడు. ఈ కారణంగా టీమిండియా అభిమానులు, కోహ్లీ ఫ్యాన్స్ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇంకా తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా తెలియజేస్తున్నారు.
ఆసియా కప్ కోసం ఆఫ్గాన్ జట్టు..
Here’s AfghanAtalan’s lineup for the ACC Men’s Asia Cup 2023. 🤩#AfghanAtalan | #AsiaCup2023 pic.twitter.com/kHHmR2GhxO
— Afghanistan Cricket Board (@ACBofficials) August 27, 2023
కోహ్లీతో గొడవ పడితే ఎక్కడా చోటు ఉండదు..
Naveen ul Haq vs Virat Kohli ❎#CricketTwitter #RCB #LSG #India #AsiaCup2023 #ViratKohli𓃵 pic.twitter.com/nCSfGbpR79
— CRICKETNMORE (@cricketnmore) August 27, 2023
కోహ్లీ బాదుడు నుంచి తప్పించుకున్నాడు..
We will sadly miss the spectacle of Virat Kohli giving Naveen Ul Haq’s bowling a one-way ticket to the stands! 😉😉
Naveen ul haq misses out from Afghanistan’s Squad for Asia cup 2023. pic.twitter.com/bAh9PznTk3
— Vipin Tiwari (@vipintiwari952) August 27, 2023
అదృష్టవంతుడు..
Naveen up Haq is lucky that he won’t be playing in the Asia Cup. Otherwise he would’ve been smashed all the over park by Virat Kohli if India-Afghanistan face each other. #AsiaCup2023 pic.twitter.com/6pcUfgWADC
— Saif Ahmed 🇧🇩 (@saifahmed75) August 27, 2023
కింగ్ కోహ్లీ ఇక్కడ..
Opposition lo King Kohli ❤️👑 unnapudu Jagrata ga undali Amma 🥵🤫🤭#kingkohli #naveenulhaq #ViratKohli𓃵 #AsiaCup2023 pic.twitter.com/KZ3zG0pv6I
— Addicted To Memes (@Addictedtomemez) August 29, 2023
నో ప్లేస్..
Where is Mango Man @naveenulhaq_ No Place In Asip Cup 😀😀 pic.twitter.com/ZpdHTrUlSv
— RamaRoyal@18 (@Gangadh82484853) August 29, 2023
కాగా భారత్ సెప్టెంబర్ 2న పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్, సెప్టెంబర్ 4న నేపాల్‌తో రెండో మ్యాచ్ ఆడనుంది. భారత్ ఏ గ్రూప్‌లో, ఆఫ్గాన్ టీమ్ బి టీమ్‌లో ఉన్నందున.. రెండు సూపర్ ఫోర్ రౌండ్‌లో తలపడనున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..