Team India: ఇకపై టీ20ల్లో విరాట్, రోహిత్‌లు డౌటే.? కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

|

Jan 07, 2023 | 9:43 AM

యంగ్ ప్లేయర్లకు గుడ్‌న్యూస్‌ అందించారు టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్. టీ20ల్లో మరిన్ని అవకాశాలు ఇస్తామని భరోసా ఇచ్చారు. అంటే..

Team India: ఇకపై టీ20ల్లో విరాట్, రోహిత్‌లు డౌటే.? కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Rahul Dravid
Follow us on

యంగ్ ప్లేయర్లకు గుడ్‌న్యూస్‌ అందించారు టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్. టీ20ల్లో మరిన్ని అవకాశాలు ఇస్తామని భరోసా ఇచ్చారు. అంటే.. రోహిత్ శర్మ, విరాట్‌ కోహ్లీలకు టీ20ల్లో ప్లేస్‌ లేదని చెప్పకనే చెప్పేశాడా..? రాహుల్ మాటల్లో మర్మమేంటి?

శ్రీలంకపై రెండో టీ20లో టీమిండియా ఓటమి ఫ్యాన్స్‌ని బాగా హర్ట్ చేసింది. 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 16 పరుగుల తేడాతో మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఈ క్రమంలో హెడ్ కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యువ ఆటగాళ్ల విషయంలో ఓర్పుతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నాడు. భవిష్యత్తులో టీ20 టీమ్‌లో భారీ మార్పులు ఉంటాయన్నాడు.

టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ఇకపై అవకాశాలు రాకపోవచ్చని ద్రవిడ్ మాటల సారాంశంగా కనిపిస్తోంది. అందుకే యువ ఆటగాళ్లకు ఫుల్‌ సపోర్ట్ చేస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. ఇప్పటికే టీ20లకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా హార్థిక్ పాండ్యాను బీసీసీఐ నియమించింది. ఇప్పుడు ద్రవిడ్ మాటలు వింటుంటే.. సీనియర్ ఆటగాళ్లకు ఇకపై టీ20ల్లో చోటు కష్టమేనని క్లియర్ కట్‌గా అర్థమవుతోంది.

ఇండియన్‌ క్రికెట్‌కు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ దశాబ్ద కాలంగా మూలస్తంభాలుగా నిలుస్తున్నారు. అన్ని ఫార్మాట్లలోనూ టీమ్‌ భారాన్ని మోసే బ్యాటర్లుగా, కెప్టెన్లుగా వ్యవహరించారు. అయితే గతేడాది టీ20 వరల్డ్‌కప్‌ సెమీస్‌లో ఇండియా ఓటమి తర్వాత ఈ ఫార్మాట్‌లో వీళ్లిద్దరినీ పక్కన పెట్టి యువ ఆటగాళ్ల వైపు చూడాలన్న డిమాండ్లు వచ్చాయి. గత న్యూజిలాండ్‌ టూర్‌లో, ఇప్పుడు శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ఈ ఇద్దరు సీనియర్లు టీమ్‌లో లేరు. ఇక వీళ్లను టీ20ల్లో చూసే అవకాశం ఉండదని తెలుస్తోంది. అదే జరిగితే విరాట్‌, రోహిత్‌ల మెరుపులు ఇక ఐపీఎల్‌లో చూడాల్సిందే.