Happy Birthday Dhoni: హెయిర్ కట్ వద్దు.. పొడవాటి జుట్టుతోనే బాగున్నావ్..! ధోనీకి సలహా ఇచ్చిన పాకిస్తాన్ మాజీ ప్రెసిడెంట్

|

Jul 07, 2021 | 3:05 PM

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. భారత క్రికెట్ లో తనదైన ముద్ర వేసి, గొప్ప సారథిగా పేరుగాంచిన సంగతి తెలిసిందే. నేడు తన పుట్టిన రోజు (జులై 7న) సందర్భంగా సోషల్ మీడియాలో ధోనీ పేరు మారుమోగిపోతోంది.

Happy Birthday Dhoni: హెయిర్ కట్ వద్దు.. పొడవాటి జుట్టుతోనే బాగున్నావ్..! ధోనీకి సలహా ఇచ్చిన పాకిస్తాన్ మాజీ ప్రెసిడెంట్
Happy Birthday Dhoni
Follow us on

Happy Birthday Dhoni: భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. భారత క్రికెట్ లో తనదైన ముద్ర వేసి, గొప్ప సారథిగా పేరుగాంచిన సంగతి తెలిసిందే. నేడు తన పుట్టిన రోజు (జులై 7న) సందర్భంగా సోషల్ మీడియాలో ధోనీ పేరు మారుమోగిపోతోంది. టీమిండియాకు అంతకు ముందున్న కెప్టెన్ల కంటే ఎక్కువ విజయాలు అందించి చరిత్రలో నిలిచాడు. ఆటలోనే కాదు తన స్టైల్ తోనూ అభిమానులను ఆకట్టుకోవడంలో ఆయన రూటే సపరేటు. ధోనీ 2005-06 సీజన్ లో పొడవాటి జుట్టుతో కనిపించాడు. ఈ పొడవాటి జుట్టు ఇండియాలోనే కాదు.. మన పొరుగు దేశం పాకిస్తాన్ లోనూ అభిమానులను సంపాదించేలా చేసింది. వీరిలో పాకిస్తాన్ మాజీ ప్రెసిడెంట్ పర్వేజ్ ముషారఫ్ కూడా ఉండడం విశేషం.

2005-06 సీజన్ లో టీమిండియా.. పాకిస్తాన్ పర్యటనకు వెళ్లింది. ఈ సమయంలో దాయాది పోరును చూసేందుకు అప్పటి మాజీ ప్రెసిడెంట్ ముషారఫ్ కూడా హాజరయ్యాడు. లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో జరిగిన్ మూడో వన్డేను చూసేందుకు ఆయన హాజరయ్యాడు. ఈ సమయంలోనే ధోనీ పొడవైన జుట్టును చూసి ముచ్చటపడ్డాడు. లాహోర్ లో జరిగిన మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ముషారఫ్.. ధోనీ జుట్టుపై మాట్లాడాడు. ధోనీ పొడవాటి జుట్టులో చాలా బాగున్నాడని, ఎప్పటికీ అలానే ఉంచుకోవాలని సలహా ఇచ్చాడు. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించింది. టీమిండియా విజయానికి ధోనీ కీలకంగా వ్యవహరించాడని ఆయన ప్రసంశించారు.

ఈ సందర్భంగా ధోనీతో ముషారఫ్ మాట్లాడుతూ, ‘మ్యాచ్ జరుగుతున్నప్పుడు నేనో ప్లకార్డును చూశాను. అందులో ‘ధోనీ హెయిర్ కట్ చేయించుకో’ అని రాసి ఉంది. కానీ, నా అభిప్రాయం మేరకు ధోనీ పొడవాటి జట్టులోనే బాగున్నాడు. దయచేసి హెయిర్ కట్ చేయించుకోకు అని’ పేర్కొన్నాడు. భారత్, పాకిస్తాన్ ల మధ్య జరిగిన ద్వైపాక్షిక సిరీస్ లో మూడవ వన్డే అనంతంర ఆయన మాట్లాడారు. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్‌ను భారత్ ఓడించింది. ధోనీ తో ముషారఫ్ మాట్లాడిన వీడియో ఇప్పటికీ ఇరు దేశాల అభిమానులు ఇష్టపడుతూనే ఉన్నారు. ఏ ఫార్మెట్ లో అయినా.. పాకిస్తాన్ పై భారీ స్కోర్ చేయడం ధోనీకి అలవాటుగా మారింది. 2006లో జరిగిన మూడవ వన్డే విజయంలో ధోనీ కీలకంగా వ్యవహరించాడు. విన్నింగ్ షాట్లతో మ్యాచ్ ను గెలుపు దిశగా మల్లించాడు.

మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 287 పరుగులు చేసింది. అనంతరం 288 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. ధోనీ తోపాటు యువరాజ్ సింగ్ చెలరేగిపోవడంతో.. పాక్ జట్టుపై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో యువరాజ్ 87 బంతుల్లో 79 పరుగులతో అజేయంగా 79 నిలవగా, ధోనీ కేవలం 46 బంతుల్లో 72 పరుగులు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. సునామీ లా పరుగులు రాబట్టిన ధోనీ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌’ గా ఎంపికయ్యాడు.

Also Read:

Dhoni Birthday: ఎంస్ ధోనీ బర్త్‌డే స్పెషల్.. కెప్టెన్‌గా మహీ సాధించిన ఐదు గొప్ప రికార్డులు ఇవే..

Dhoni: హ్యాపీ బర్త్‌డే ‘మిస్టర్ కూల్’.. కెప్టెన్లకే ‘బాద్‌షా’.. భారత క్రికెట్‌లో ఓ ట్రెండ్ సెట్టర్..