ఐపీఎల్ 2022లో భాగంగా మంబైలోని వాఖండే స్డేడియంలో కోల్‌కత్త నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల కోల్పోయి 146 పరుగులు చేసింది. రెండో ఓవర్‌లోనే అరోన్ ఫించ్ చేతన్ సకారియ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఐదో ఓవర్‌లో అక్సర్ పటేల్ బౌలింగ్‌లో వెంకటేష్ అయ్యారు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన ఇంద్రజిత్, సునీల్ నరైన్ వెంటవెంటనే ఔటయ్యారు.
దీంతో నితిష్ రాణా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. 37 బంతుల్లో 24(4 ఫోర్లు) పరుగులు చేసిన శ్రేయస్ కుల్దీప్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన అండ్రూ రసెల్ స్టాంప్ ఔటయ్యాడు. నితిష్ రాణా, రింక్ సింగ్ జట్టును ఆదుకున్నారు. ఈ క్రమంలో నితిష్ రాణా హాఫ్ సెంచరీ చేశాడు. 34 బంతుల్లో 57(3 ఫోర్లు, 4 సిక్స్‌లు) పరుగులు చేశాడు. రింక్ సింగ్ 23 పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్ల్ పడగొట్టగా రెహమన్ మూడు, అక్సర్ పటేల్, సకరియా ఒక్కో వికెట్ తీశారు.