10 బంతుల్లోనే ఏకంగా 5 సిక్సర్లు.. 10 కోట్ల ప్లేయర్ ఊచకోత మాములుగా లేదుగా.! ఎవరంటే.?

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, ఎల్‌ఎస్‌జీ మధ్య జరిగిన మ్యాచ్‌లో సిక్సర్ల మోత మోగింది. ముఖ్యంగా లక్నో వైస్ కెప్టెన్ నికోలస్ పూరన్ హార్డ్ హిట్టింగ్‌కు బెంగళూరు బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ఇన్నింగ్స్ ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చిన పూరన్.. చివరి రెండు ఓవర్లలోనూ ఆర్సీబీ బౌలర్లను ఊచకోత కోశాడు.

10 బంతుల్లోనే ఏకంగా 5 సిక్సర్లు.. 10 కోట్ల ప్లేయర్ ఊచకోత మాములుగా లేదుగా.! ఎవరంటే.?
Lsg Vs Rcb
Follow us

|

Updated on: Apr 03, 2024 | 8:03 AM

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, ఎల్‌ఎస్‌జీ మధ్య జరిగిన మ్యాచ్‌లో సిక్సర్ల మోత మోగింది. ముఖ్యంగా లక్నో వైస్ కెప్టెన్ నికోలస్ పూరన్ హార్డ్ హిట్టింగ్‌కు బెంగళూరు బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ఇన్నింగ్స్ ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చిన పూరన్.. చివరి రెండు ఓవర్లలోనూ ఆర్సీబీ బౌలర్లను ఊచకోత కోశాడు. మొత్తంగా 21 బంతుల్లో 5 భారీ సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. 16వ ఓవర్‌లో నికోలస్ పూరన్ క్రీజులోకి వచ్చాడు. మొదటి 6 బంతులు ఆడేందుకు కాస్త ఇబ్బందిపడ్డ పూరన్.. 19వ ఓవర్ వచ్చేసరికి గేర్ మార్చి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ RCB ఫాస్ట్ బౌలర్ రీస్ టాప్లీ వేసిన 19వ ఓవర్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. వాటిల్లో ఒకటి 106 మీటర్ల డిస్టెన్స్‌లో ఏకంగా స్టేడియం దాటేసింది. ఆ తర్వాత మహ్మద్ సిరాజ్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో పూరన్.. రెండు వరుస బంతుల్లో సిక్సర్లు బాదాడు. 100 స్ట్రైక్‌రేట్‌తో తన ఇన్నింగ్స్ మొదలుపెట్టిన పూరన్.. ఇన్నింగ్స్ పూర్తయ్యేసరికి తన స్ట్రైక్ రేట్‌ను 190కి మార్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లో పూరన్‌తో పాటు లక్నో ఓపెనర్ డికాక్ కూడా తన బ్యాట్ ఝళిపించాడు. 56 బంతుల్లో 81 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించడంలో సహాయపడ్డాడు. ఈ ఇన్నింగ్స్‌లో డికాక్ 5 సిక్సర్లు, 8 ఫోర్లు బాదాడు. అటు మార్కస్ స్టోయినిస్ కూడా 24 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.

మరోవైపు లక్నో నిర్దేశించిన 182 పరుగుల టార్గెట్‌ను చేధించడంలో బెంగళూరు చతికిలబడింది. లక్నో స్వింగ్ బౌలర్ మయాంక్ యాదవ్(3/14) దెబ్బకు కేవలం 153 పరుగులకే ఆలౌట్ అయింది. వెరిసి లక్నో 28 పరుగుల తేడాతో అద్భుత విజయం అందుకుంది. ఈ మ్యాచ్‌తో లక్నోకి ఇది రెండో విజయం కాగా, పంజాబ్‌కు వరుసగా రెండో ఓటమి.

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్