ఐపీఎల్‌లో తుస్సుమనిపించాడు.. కట్ చేస్తే.. 20 ఫోర్లు, 20 సిక్సర్లతో 326 పరుగులు బాదేశాడు.. ఎవరంటే?

|

Feb 10, 2023 | 1:49 PM

ఈ ప్లేయర్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరపున బరిలోకి దిగాడు. ఏకంగా రూ. 10 కోట్లతో అతడ్ని యాజమాన్యం కొనుగోలు చేసింది.

ఐపీఎల్‌లో తుస్సుమనిపించాడు.. కట్ చేస్తే.. 20 ఫోర్లు, 20 సిక్సర్లతో 326 పరుగులు బాదేశాడు.. ఎవరంటే?
Nicholas Pooran
Follow us on

ఈ ప్లేయర్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరపున బరిలోకి దిగాడు. ఏకంగా రూ. 10 కోట్లతో అతడ్ని యాజమాన్యం కొనుగోలు చేసింది. భారీ స్కోర్లతో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడతాడని ఊహిస్తే.. తుస్సుమనిపించాడు. కట్ చేస్తే.. గత సీజన్‌లో సన్‌రైజర్స్ లీగ్ స్టేజిలోని ఇంటి ముఖం పట్టింది. మరి ఆ ప్లేయర్ ఎవరనుకుంటున్నారా.? అతడెవరో కాదు నికోలస్ పూరన్.

దుబాయ్ వేదికగా జరుగుతోన్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో నికోలస్ పూరన్ తన అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు. గురువారం జరిగిన కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో పూరన(66) అర్ధ సెంచరీతో అదరగొట్టి తన జట్టును క్వాలిఫైయర్‌కు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దుబాయ్ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. మున్సే(51), రాజా(38), పావెల్(30) ఫర్వాలేదనిపించారు. అటు ముంబై బౌలర్లలో బౌల్ట్, రషీద్ ఖాన్ చెరో రెండు వికెట్లు, బ్రావో ఒక వికెట్ పడగొట్టారు.

ఇక 152 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఎమిరేట్స్ జట్టును ఫ్లెచర్(68), పూరన్(66) ఆదుకున్నారు. ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి.. తమ జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. అంతేకాకుండా ఎలిమినేటర్ గండాన్ని సైతం తప్పించారు.

అదరగొడుతోన్న పూరన్..

ఈ టోర్నమెంట్‌లో పూరన్ ఆదరగొడుతున్నాడు. వరుసగా అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడుతూ తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటిదాకా 9 మ్యాచ్‌లు ఆడిన పూరన్.. 20 ఫోర్లు, 20 సిక్సర్లతో 326 పరుగులు చేశాడు. అలాగే తన ఖాతాలో రెండు అర్ధ సెంచరీలు వేసుకున్నాడు.