NZ vs AUS T20 WC: ఆస్ట్రేలియాకు భారీ షాకిచ్చిన కివీస్.. తొలి మ్యాచ్‌లో ఘన విజయం.. ఆకట్టుకున్న కాన్వే, శాంట్నర్

|

Oct 22, 2022 | 4:06 PM

201 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు.. కేవలం 17.1 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 89 పరుగులతో న్యూజిలాండ్ టీం ఘన విజయం సాధించింది.

NZ vs AUS T20 WC: ఆస్ట్రేలియాకు భారీ షాకిచ్చిన కివీస్.. తొలి మ్యాచ్‌లో ఘన విజయం.. ఆకట్టుకున్న కాన్వే, శాంట్నర్
Aus Vs Nz Match
Follow us on

టీ20 ప్రపంచకప్‌లో సూపర్-12 తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. తొలి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్‌పై ఘోర పరాజయం పాలైంది. 201 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు.. కేవలం 17.1 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 89 పరుగులతో న్యూజిలాండ్ టీం ఘన విజయం సాధించింది. కివీస్ టీం టీ20 ప్రపంచ కప్‌లో బోణీ కొట్టింది. టిమ్ సౌథీ, మిచ్ సాంట్నర్ తలో 3 వికెట్లు తీశారు. ఆస్ట్రేలియా తరఫున గ్లెన్ మాక్స్‌వెల్ అత్యధికంగా 28 పరుగులు చేశాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్ నిర్ణయం తప్పని న్యూజిలాండ్ నిరూపించింది. ఈ గ్రూప్-1 మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే అత్యధికంగా 92 పరుగుల ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఫిన్ అలెన్ 16 బంతుల్లో 42 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ తరపున కెప్టెన్ కేన్ విలియమ్సన్ 23, గ్లెన్ ఫిలిప్స్ 12, జేమ్స్ నీషమ్ 26 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా తరపున జోష్ హేజిల్‌వుడ్ రెండు, ఆడమ్ జంపా ఒక వికెట్ తీశారు.

ఫిన్ అలెన్, కాన్వే తుఫాన్ ఇన్నింగ్స్..

న్యూజిలాండ్ ఆరంభం బాగుంది. ఓపెనర్ ఫిన్ అలెన్, కాన్వే తొలి వికెట్‌కు 25 బంతుల్లో 56 పరుగులు జోడించారు. అలెన్ తన ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు. అతడి ఔటైన తర్వాత కివీస్‌ ఇన్నింగ్స్‌లో వేగం కాస్త తగ్గింది.

ఇరు జట్ల ప్లేయింగ్ XI..

న్యూజిలాండ్: డెవాన్ కాన్వే(w), ఫిన్ అలెన్, కేన్ విలియమ్సన్(c), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్

ఇవి కూడా చదవండి

ఆస్ట్రేలియా : ఆరోన్ ఫించ్ (సి), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (w), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్