New Zealand Women vs England Women: మేం మునిగిపోయాం. అయితే, మిమ్మల్ని కూడా ముంచుతాం. ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2022 పిచ్‌పై ఇంగ్లండ్ జట్టు ప్రస్తుతం అలాంటిదే చేస్తోంది. మొదటి 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయిన తర్వాత ఇంగ్లండ్‌కు ప్రతి మ్యాచ్ డూ ఆర్ డై లాంటింది. అంటే ప్రతి మ్యాచ్‌లో విజయం సాధించడం తప్పనిసరిగా మారింది. తాజాగా ఇంగ్లండ్ బాధితురాలుగా న్యూజిలాండ్ టీం మారింది. ఇంగ్లండ్ ఉమెన్స్ 1 వికెట్ తేడాతో కివీస్ టీం గెలిచింది. టోర్నీలో ఇంగ్లండ్‌కు ఇది రెండో విజయం. మరోవైపు ఓటమితో ఆతిథ్య న్యూజిలాండ్‌కు కష్టాలు ఎక్కువయ్యాయి. ఎందుకంటే ప్రస్తుతం 6 మ్యాచ్‌ల్లో వారికిది నాలుగో ఓటమి.
ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. 48.5 ఓవర్లలో 203 పరుగులకే ఆలౌటైంది. 204 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 47.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి స్కోరును ఛేదించింది. అయితే చివరి క్షణంలో ఈ మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా మారింది. అంటే విజయం ఎటువైపు ఉందో చెప్పలేనతంగా మారింది.
11 బంతుల్లోనే 4 వికెట్లు..
ఇంగ్లండ్ 9 వికెట్లలో చివరి 4 వికెట్లు కేవలం 11 బంతుల్లోనే పడిపోవడంతో మ్యాచ్‌లో ఉత్కంఠ పెరిగింది. అర్ధ సెంచరీ చేసి నేట్ సీవర్ వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ ఆరో వికెట్ గా 44వ ఓవర్ రెండో బంతికి నేట్ వికెట్ పడింది. ఈ సమయానికి ఇంగ్లండ్ స్కోరు 187 పరుగులు. దీని తర్వాత మరో 10 బంతుల్లో మరో 3 వికెట్లు పడిపోయి టెన్షన్ పెంచింది. చివరకు అన్య ష్రూబ్సోల్ మాత్రం ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా ఒక ఫోర్ కొట్టడంతో స్కోర్స్ లెవల్ చేసింది. అనంతరం మరో సింగిల్ తీసి ఇంగ్లండ్‌కు విజయాన్ని సాధించింది.