NZ vs AFG ICC WC Match Preview: మరోసారి షాక్ ఇచ్చేందుకు సిద్ధమైన ఆఫ్ఘాన్.. న్యూజిలాండ్‌తో కీలక పోరు..
ICC world Cup 2023: కివీ జట్టు చివరి మ్యాచ్‌లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ పునరాగమనం చేశాడు. అయితే మ్యాచ్ సమయంలో అతను బొటనవేలికి తీవ్ర గాయం కావడంతో రాబోయే మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో టామ్ లాథమ్ మరోసారి జట్టు బాధ్యతలు చేపట్టనున్నాడు. ప్రపంచ కప్, ODI చరిత్రలో, రెండు జట్లు ఇప్పటివరకు రెండుసార్లు ముఖాముఖిగా తలపడ్డాయి.
New Zealand vs Afghanistan, ICC world Cup 2023: నేడు ప్రపంచ కప్ (ICC Cricket World Cup 2023) 16వ మ్యాచ్ చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో జరగనుంది. న్యూజిలాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ (NZ vs AFG) మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఒకవైపు వరుసగా మూడు విజయాలతో కివీ జట్టు దూసుకపోతుండగా.. గత మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి అఫ్గాన్ జట్టు ఈ టోర్నీలో అతిపెద్ద విజయాన్ని దక్కించుకుంది. చెపాక్ గడ్డపై ఆఫ్ఘనిస్థాన్ స్పిన్ బౌలింగ్ న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌కు గట్టి సవాలును అందించనుంది.
కివీ జట్టు చివరి మ్యాచ్‌లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ పునరాగమనం చేశాడు. అయితే మ్యాచ్ సమయంలో అతను బొటనవేలికి తీవ్ర గాయం కావడంతో రాబోయే మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో టామ్ లాథమ్ మరోసారి జట్టు బాధ్యతలు చేపట్టనున్నాడు. ప్రపంచ కప్, ODI చరిత్రలో, రెండు జట్లు ఇప్పటివరకు రెండుసార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో కివీ జట్టు రెండుసార్లు గెలిచింది. అయితే, డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను ఓడించిన తర్వాత ఆఫ్ఘనిస్థాన్ ఆత్మవిశ్వాసం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో న్యూజిలాండ్‌పై మరోసారి ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరిచేందుకు అఫ్గాన్ జట్టు సిద్ధమైంది.
ఇరుజట్ల ప్రాబబుల్ ప్లేయింగ్ 11..
న్యూజిలాండ్: టామ్ లాథమ్ (కెప్టెన్, వికెట్ కీపర్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గూసన్.
ఆఫ్ఘనిస్తాన్: హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, అజ్మతుల్లా ఉమర్జాయ్, ముజీబ్ ఉర్ రెహమాన్, ఫజల్హాక్ ఫరూకీ, నవీన్-ఉల్-హకీన్.
పిచ్, వాతావరణం..
MA చిదంబరం, చెన్నై పిచ్ నెమ్మదిగా, స్పిన్ బౌలర్లకు సహాయకరంగా ఉందని నిరూపితమైంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో స్పిన్ బౌలింగ్‌దే ఆధిపత్యం. లక్ష్యాన్ని ఛేదించే జట్టుదే విజయం.
మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం..
View this post on Instagram
భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ మధ్యాహ్నం 1:30లకు పడనుంది. స్టార్ స్పోర్ట్స్‌లో ఈ మ్యాచ్‌ని టీవీలో చూడొచ్చు. ఇది Disney+Hotstar ఓటీటీలోనూ చూడొచ్చు.
రికార్డులు..
– న్యూజిలాండ్ ఇప్పటివరకు ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండు ప్రపంచకప్ మ్యాచ్‌లను గెలుచుకుంది. 2019లో టౌంటన్‌లో జరిగిన వరల్డ్ కప్‌లో ఈ రెండు జట్లు చివరిసారిగా పోటీపడిన సమయంలో ఫెర్గూసన్ 4/37తో ఆకట్టుకున్నాడు.
– ఇంగ్లండ్‌ను ఓడించడం ద్వారా ప్రపంచ కప్‌లలో ఆఫ్ఘనిస్తాన్ 14-మ్యాచ్‌ల ఓటముల పరంపరకు స్వస్తి చెప్పింది.
– ఆసియాలో పూర్తయిన చివరి ఆరు ODIలలో న్యూజిలాండ్ విజయం సాధించింది. అందులో ఒకటి పాకిస్థాన్‌లో, రెండు బంగ్లాదేశ్‌లో, మూడు భారత్‌లో విజయం దక్కించుకుంది.
స్క్వాడ్‌లు:
న్యూజిలాండ్ జట్టు: డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్(కీపర్/కెప్టెన్), మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, విల్ యంగ్, ట్రెంట్ బౌల్ట్, ఇష్ సోధి, జేమ్స్ నీషమ్, టిమ్ సౌథీ.
ఆఫ్ఘనిస్తాన్ స్క్వాడ్: రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రమ్ అలీఖిల్(కీపర్), మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహమాన్, నవీన్-ఉల్-హక్, ఫజల్హఖ్, ఫజల్హాఖ్, ఫజల్హాఖ్ రెహమాన్, రియాజ్ హసన్, నూర్ అహ్మద్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..